See My New Blogspot
Click On
ANDHRA PRADESH SCIENCE TEACHER
_______________________________
ఉపవాసానికీ..ఉత్తరదిశకీ లంకె ఉందా..?
Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Apr 2012, IST

డాక్టర్ వెంగనూర్ బాలకృష్ణన్ అనే ఆయన రచించిన 'తాళపత్రం' అనే గ్రంథంలో అనేక చిత్ర విచిత్ర అంశాలు ప్రస్తావించబడ్డాయి. దీనిని చదివితే ఆచారాల వెనుకనున్న శాస్త్రీయతను వివరించే పేరుమీద 'బట్టతలకీ మోకాలికీ ముడి వేయడం' అనే సామెత గుర్తుకొస్తోంది. ఉదాహరణకు ఆ గ్రంథం 158వ పేజీలో 'బుధవారం రోజు ఉపవాస దీక్షను పాటిస్తున్నవారు ఉత్తరం దిశగా ప్రయాణం చేయకూడదని చెప్పబడింది. వెనుకటి రోజుల్లో ప్రయాణాలు కాలి నడకనే ఉండేవి. ప్రయాణం చేయవలసిన వారు ఆహారం తీసుకోకుంటే ఆరోగ్యం దెబ్బతినదా? ప్రయాణంలో కూడా ఉత్తరదిశ ప్రయాణమే చేయకూడదట. దానికి కారణం దక్షణ ధృవం నుండి ఉత్తర ధృవానికి అయస్కాంతశక్తి వ్యాపించి ఉంటుందనీ, ఆ అయస్కాంత శక్తి వ్యాపించి, దీక్షలో ఉన్నవారిపై విరుద్ధ ప్రభావాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరదిశగా ప్రయాణించకూడదన్న నియమాన్ని పెట్టడం జరిగిందట. ఆ విరుద్ధ ప్రభావం బుధవారం నాడే ఎందుకు ఉంటుంది? మిగిలిన రోజుల్లో అయస్కాంతశక్తి మారిపోతుందా? విరుద్ధప్రభావం ఉపవాస దీక్షలో ఉన్న వారిమీదే ఎందుకు ఉంటుంది? మిగిలిన వారి మీద ఎందుకు ఉండదు? ఇదంతా అర్థంపర్థంలేని ఆచారాలకు శాస్త్రీయ కారణాలున్నాయనే పేరు మీద కొన్ని సైన్సుపదాలను వాడుకొనే ప్రయత్నంగా కనిపించడం లేదూ?! మూఢవిశ్వాసాలను శాస్త్రీయతకు ఆపాదించడంగా కనిపించడం లేదూ..?!
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
______________________________________________________________________________________
విశ్వమార్పులు..
Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Apr 2012, IST

గతవారం 'హరాత్మక చలన' విశ్వ నమూనా (Model of Oscillating Universe) యే ఎక్కువ శాస్త్రీయతకు అనుగుణంగా ఉందని అను కొన్నాం. ఈ హరాత్మక చలన విశ్వనమూనానే 'పల్సేటింగ్ యూనివర్స్ (Pulsating Universe)' అని కూడా అంటున్నారు. దీనిని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా సమర్థించాడు. దీని ప్రకారం విశ్వానికి అంతం, ఆది లేవు. విశ్వం శాశ్వతం. అయితే అందులో మార్పులూ శాశ్వతమే! మారనిది అంటూ విశ్వంలో ఏదీ లేదు. పదార్థం అంతా ఒకే బిందువు రూపంలోకి వెళ్లినపుడు అందులో పాదార్థిక వైవిధ్యం ఉండదు. పాదార్థిక వైవిధ్యంలేని వ్యవస్థలో కాలం అంటూ ఏదీ ఉండదు. కాబట్టి మన ఊపిరితిత్తులు వెడల్పు అవుతూ, మళ్లీ కుంచించుకుంటున్నట్టుగా ఈ విశ్వం అత్యంత విశాలమైన స్థల రూపంలోకి, అత్యంత కనిష్టమైన స్థల రూపంలోకి పదే పదే వలయ చక్రీయ (Expanding Spiral) గమనంలో ఉన్నట్టు ఈ సిద్ధాంతపు సారాంశం. ప్రస్తుతం మన (సమకాలీన) విశ్వస్థితి పల్స్ (ఘటనావ్యవస్థ) లో ఓ దశగా భావించాలి. ఇందులోకి 'మహా విస్ఫోటన' సిద్ధాంతాన్ని అంతర్లీనంగా జొన్పించవచ్చును. సుమారు 1500 కోట్ల సంవత్సరాల కిందట ఈ విశ్వం ఓ రాగి గింజ కన్నా ఇంకా తక్కువ స్థలంలో ఉండేది. అది ఆంతరంగిక ఘర్షణ వల్ల పేలింది. అప్పుడే వైవిధ్యం గల పదార్థం ఆవిర్భవించింది.
విసిరివేయబడ్డట్టు పాదార్థిక భాగాలు చెల్లాచెదురైన క్రమంలో పాదార్థిక రూపాలు గోళాకారాన్ని సంతరించు కొంటాయి. అందులో ఓ గోళాకార పదార్థ సంచయం (lump of matter) పాలపుంత. మొదట సంపూర్ణ గోళాకారంగానే ఉన్నా ఏదో ఒక అంతర్గత అక్షం (axis) చుట్టూనే దాని పదార్థం తిరగడం వల్ల అక్షం దగ్గర ఉబ్బుగానూ అంచుల్లో పలుచగానూ అయ్యే స్థితి ఏర్పడుతుంది. ఇది నిత్యజీవితంలో మనకెదురయ్యే అపకేంద్రబలం (centrifugal force) వల్ల సిద్ధిస్తుంది. అక్షం నుంచి దూరం వెళ్లే కొలదీ వేగం పెరగడం వల్ల అపకేంద్ర బలం కూడా పెరుగుతుంది. అందువల్ల చివర ఉన్న భాగాలు మళ్లీ చిందర వందర గోళాకార ముక్కలుగా విడిపడతాయి. అందులో ఓ అంచులో ఉన్న పాదార్థిక భాగం సౌరమండలం (Solar System) గా రూపొందింది. ఇది కూడా ఉబ్బిన పూరీలాగానూ లేదా ఇడ్లీలాగాను మధ్యలో ఉబ్బుగా, అంచుల్లో పలుచగా ఉండేది. ఇది ఏర్పడి దాదాపు 700 కోట్ల సంవత్సరాలైంది.
ఇందులో మళ్లీ గతితార్కిక పద్ధతిలో అంతర్గత వైరుధ్యాలు, ఘర్షణల వల్ల పరిమాణాత్మకమార్పు, గుణాత్మకమార్పు చెందే విశ్వ నియమానుసారం మధ్యలో అలాగే పదార్థం పోగై సూర్యగోళం రూపొందగా.. అంచుల్లో ఉన్నవి ఆయా సందర్భాల్లో తలెత్తిన యాధృచ్ఛిక (stochastic chance) పునరమరికలో భాగంగా వివిధ గ్రహాలుగా ఏర్పడ్డాయి. విశ్వ గమనంలో యాధృచ్ఛికతకు చాలా పాత్ర ఉంది. ఓ వంద నాణేలను నిరుపేక్ష (impartial) గా పైకి గిరాటేస్తే ఏ నాణెం బొమ్మ పడుతుందో, ఏ నాణెం బొరుసు పడుతుందో చెప్పలేం. కానీ ప్రతినాణెం బొమ్మైనా పడాలి లేదా బొరుసైనా పడాలి. ఏది పడుతుందన్నదే యాధృచ్ఛికం. అన్ని నాణేల్లోనూ యాధృచ్ఛికత ఉన్నా తప్పకుండా అందులో సుమారు 50 నాణేలు బొమ్మల్ని, సుమారు 50 నాణేలు బొరుసుల్ని చూపిస్తాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా 100 నాణేల్ని బొమ్మలుగానో లేదా బొరుసులుగానో వేయలేం. లేదా 25 బొమ్మలుగానూ 75 బొరుసులుగానూ కూడా చూళ్లేము. ఇలా 50 అటూ, 50 యిటూ పడ్డానికే చాలాసార్లు అవకాశం ఉంది. ఇది క్రమత్వం. ఇందులో యాధృచ్ఛికత లేదు. ఇలా విడివిడి భాగాల్లో అంతరంగికంగా యాధృచ్ఛికత ఉన్న సమిష్టి వ్యవస్థలో క్రమత్వం సిద్ధిస్తుందని ఆధునిక క్వాంటం సిద్ధాంతం ఘోషిస్తోంది.
మధ్యలో పదార్థం సూర్యుడిగానూ అంచుల్లోని విగ్రహాలుగానూ మారాయని తెలుసుకున్నాం కదా! వాటి వాటి ప్రమాణాల్ని నిర్దేశించింది కేవలం యాధృచ్ఛికతే! సూర్యుడి నుంచి 3వ గ్రహమే భూమి. సూర్యమండల సంయుక్త పదార్థం (Solar Planetory Disc) నుంచి భూమి స్వతంత్ర పదార్థంగా విడిపడి రూపొందడాన్నే భూమి ఆవిర్భావం అనుకొంటే ఆ సంఘటన జరిగి నేటికి సుమారు 600 కోట్ల సంవత్సరాలైంది. ఆ దశలో మొదట్లో భూమి కూడా పూర్తిగా ఉదజని వాయువు (Hydrogen gas) తో నిండి ఉండేది. అంటే సూర్యుడిలాగే భూమి కూడా పుట్టిన తర్వాత 50 కోట్ల సంవత్సరాల క్రితం వరకు (అంటే నేటికి 550 కోట్ల సంవత్సరాల పూర్వం) స్వయం ప్రకాశకం.
అంటే భూమి కూడా ఒక దశలో నాలుగు హైడ్రోజన్ కేంద్రాకాలను కేంద్రక సంలీన ప్రక్రియ (nuclear fusion) ద్వారా హీలియంగా మార్చుతూ కాంతి శక్తిని, ఉష్ణశక్తి తదితర శక్తి రూపాల్ని విడుదల చేసే చిరు నక్షత్రమేనన్న మాట. కాబట్టి భూమిని సూర్యుడి సోదరిగానే భావించాలి తప్ప సంతతిగా కాదన్నది ముఖ్యమైన అంశం. కేంద్రక సంలీన చర్యల్లో ప్రధానాంశం చిన్న చిన్న కేంద్రకాలు పెద్ద కేంద్రకాలుగా గుంపు కావడం. అంటే మొదట్లో పూర్తిగా తేలికైన హైడ్రోజన్, హీలియంగా ఉండిన భూ పదార్థం క్రమక్రమంగా అధిక బరువు గల పెద్ద పెద్ద పరమాణు కేంద్రకాలుగా మారిందన్నమాట. సహజంగానే హైడ్రోజన్ వాయువు ఖర్చు కావడం వల్ల కేంద్రక సంలీన చర్యకు సరిపడా అది లేకపోవడం వల్లన భూమి నక్షత్రస్థాయి నుంచి తప్పుకుంది. ఆ తదుపరి రసాయనాలు ఏర్పడి, నీటిఆవిరి తయారుకావడం, వాతావరణం రావడం, నీటి నిల్వలు సిద్ధించడం వీలైంది. జీవానికి అనువైనస్థితులు ఏర్పడ్డాయి. ఆ వివరాలు పైవారం తెలుసుకుందాం..!
_____________________________________________________________________________________________
ప్లాస్టిక్ తినే పుట్టగొడుగు..!
Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Apr 2012, IST
'పుట్టగొడుగు' ఫంగస్ జాతికి చెందినవి. ఫంగస్ మనకి అనేకరకాల వ్యాధులను, ఇబ్బందులను కలిగిస్తుంది. అయితే, కొన్నిరకాల పుట్టగొడుగులు మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఇది వేరే విషయం. అటువంటి ఫంగస్ వల్ల మరొక లాభం ఉందని ఇప్పుడు తెలిసింది. 'పెస్తలోతయాప్సిస్ మైక్రో స్పోరా' అనే ఒక రకం పుట్టగొడుగు ఫంగస్ కేవలం 'పాలీ యురేతిన్' (ప్లాస్టిక్) తిని జీవిస్తుందని యేల్ యూనివర్శిటీ పరిశోధకులు తెలుసుకున్నారు. ఈక్వెడార్‌లో కనిపించే ఈ ఫంగస్ వల్ల మన పర్యావరణానికి చెప్పలేని మేలు కలుగుతుందని పుడు పరిశోధకులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
______________________________________________________
గుండెకు పసుపుతో చికిత్స..!
Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Apr 2012, IST
పసుపుతో అనేకానేక లాభాలున్నాయని మనదేశ ప్రజలకు బాగా తెలుసు. థారులాండ్‌లోని పరిశోధకులు పసుపు గురించి మరో విషయం తెలుసుకున్నారు. బైపాస్‌సర్జరీ చేయించుకున్న, వారిలో గుండెనొప్పులు నివారించే విషయంలో పసుపు తోడ్పడుతుందని వారి పరిశోధనల సారాంశం. బైపాస్ సర్జరీ సమయంలో దీర్ఘకాలం గుండె కండరాలకు రక్తప్రసరణ లేక దెబ్బతింటాయి. తిరిగి గుండెనొప్పి వచ్చే ఆస్కారమూ ఎక్కువగా వుంది. అటువంటి సందర్భాలలో, మామూలుగా వాడే మందులతో పాటు పసుపుకి పసుపు వర్ణాన్ని కలిగించే పదార్థం కర్క్యుమిన్‌ను కలిపి ఇస్తే గుండెనొప్పి వచ్చే అవకాశాలు తక్కువట..!
__________________________________________________________________-
'ధరిత్రి-సుస్థిర భవిష్యత్తు'
Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Apr 2012, IST

విశ్వంలో మానవజాతిలాంటి జీవులు కలిగి వున్న ఒకేఒక గ్రహం ధరిత్రి. దీనిపై జీవావిర్భావం దాదాపు 350 కోట్ల ఏళ్ల క్రితం జరిగింది. ధరిత్రి ఇప్పటిస్థితికిి చేరడానికి దాదాపు 460 కోట్ల సంవత్సరాల కాలం పట్టింది. విశ్వంలో మనలాంటి జీవాలు గల ఇతర గ్రహం మరేదైనా ఉందా అనే దిశలో పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఆధారాలు దొరకలేదు. ఇప్పటి ధరిత్రిని అస్థిరపరిచే ఎన్నోచర్యలు కొనసాగుతున్నాయి. ధరిత్రిలోని అన్ని జీవాలను పలుమార్లు పూర్తిగా నాశనం చేయగల అణుబాంబులు అమెరికా, రష్యా వంటి పలుదేశాల దగ్గరున్నాయి. వీటిని సమకూర్చుకోడానికి మరికొన్ని దేశాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. అమెరికా, దాని మిత్రదేశాలు తాము శత్రువులుగా భావించిన ఇతర దేశాలపై ఈ బాంబుల్ని ఉపయోగించడానికి వెనుకాడబోమని బెదిరిస్తున్నాయి కూడా. ప్రకృతివనరులను కొల్లగొట్టేందుకు ఏవో సాకులతో యుద్ధాలు, ఆక్రమణలు, అక్రమాలు జరుగుతున్నాయి. పర్యావరణానికి ఇవి కలిగిస్తున్న హాని అసలు అధ్యయనానికే నోచుకోవడం లేదు. ఇది చాలదన్నట్లు మానవుడు తన అవసరాలకూ, స్వార్థం కోసం వినియోగిస్తున్న ఎన్నో సాంకేతికాలు వాతావరణాన్ని వేడెక్కిస్తూ, భూగోళాన్ని అస్థిరపరిచేవిగా ఉన్నాయి. ఇదే జరిగితే మరే ఇతర గ్రహానికో పోయి, మనల్ని మనం రక్షించుకునే స్థితి కూడా లేదు. ఇతర గ్రహాల్లో కనీసం మామూలు జీవాలుండగలవన్న ఆధారాలూ లభించడం లేదు. అందువల్ల, మన పృథ్విని మనకోసం, మన భవిష్యత్తరాల కోసం సుస్థిరంగా కొనసాగేలా కాపాడుకోవాలి. ఈ లక్ష్యంతోనే 2012 'ధరిత్రి దినోత్సవం' జరుగుతోంది. ఈ సందర్భంగా 'ధరిత్రి-సుస్థిర భవిష్యత్తు' కోసం తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలను క్లుప్తంగా వివరించేందుకు చివరి భాగంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
ప్రకృతి వనరులు, ఇంధనోత్పత్తి, వినియోగ నిర్ణయాల మీద పృథ్వి భవిష్యత్తు ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరనుందని అంచనా. వీరి అభివృద్ధి అవసరాలను తీర్చడానికి ఇప్పటికన్నా ప్రకృతి వనరులను ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. ఇంధనాన్నీ అధికంగా ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధితోనే గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల పెరుగుతూ, భూగోళ వాతావరణం వేడెక్కడాన్ని, తద్వారా రాగల దుష్పరిణామాలను సంక్షిప్తంగా గతవారం ఇచ్చిన మొదటిభాగంలో తెలుసుకున్నాం.
పృథ్వి సుస్థిరభవిష్యత్తు కోసం గ్రీన్‌హౌస్‌వాయువుల విడుదలను పరిమితంచేస్తూ, భూగోళ వాతావరణ క్షీణతను అరికట్టేందుకు ఇంతవరకూ చేపట్టిన కార్యక్రమాలు ఆశించినమేర ఫలితాల్ని ఇవ్వలేదు. మరి ఈ పెరుగుతున్న జనాభా అవసరాల్ని తీరు స్తూ, భూగోళ సుస్థిరతను ఎలా కాపాడుకోవాలి? అనేది నేడు మనముందున్న ప్రధాన సవాలు. దీనికోసం హరిత సాంకేతికాలను, అభివృద్ధిని సాధించాలని ఓ బృహత్ ప్రణా ళికను ఐక్యరాజ్యసమితి 2011లో 'ప్రపంచ ఆర్థిక, సామాజిక సర్వే' నివేదిక రూపంలో మన ముందుంచింది. సుస్థిర పర్యావరణాభివృద్ధికి దోహదపడేలా, పర్యావరణానికి ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చేలా పునరుద్ధరణ కార్యక్రమాలను చేపడుతూ ఇప్పటి, భవిష్యత్తు అవసరాలను తీర్చాలని ఈ నివేదిక సూచిస్తుంది. దీనికోసం ఎప్పటిలాగా కాక, నూతనత్వంతో కూడిన సాంకేతికాలతో అభివృద్ధిని సాధించాలని సూచించింది.
మూల సిద్ధాంతం..
ష తరిగిపోయే వనరులకు బదులు, తరగని, పునర్వినియోగించుకోగల వనరుల ఆధారంగా జరిగే అభివృద్దే సుస్థిరాభివృద్ధి. ఇదే ధరిత్రికి సుస్థిర భవిష్యత్తును చేకూరుస్తుంది.
* ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ హరితార్థికాభివృద్ధికి, సుస్థిర భవిష్యత్తుకు మూలాధారం.
* భూమి, నీరు వంటి మౌలిక వనరులను గరిష్ట సామర్థ్యంతో వినియోగించాలి. ఇప్పటి సామర్థ్యాన్ని పెంచాలి.
* చౌకైన, సమర్ధవంతమైన విద్యుత్. దూరదృష్టితో తరగని, పునర్వినియోగించు కోగల వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేలా ధరలను నిర్ణయించాలి.
* గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను కనీసస్థాయికి తగ్గించగల సాంకేతికాల వినియోగం.
* అడువుల సంరక్షణ, పునర్ పెంపకం, సుస్థిర యాజమాన్య పద్ధతులు, జీవవైవిధ్య సంరక్షణ.
* సమర్థవంతమైన ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు, వ్యక్తిగత రవాణాను నిరుత్సాహపరిచే విధానం.
* భాగస్వామ్యంగల గ్రామీణ ఇంధనం, సాగునీటి యాజమాన్యం, గ్రామీణాభివృద్ధి.
నష్టపరుస్తున్న శక్తులు..
* కార్పొరేట్ శక్తుల అమిత లాభాపేక్ష.
* సంపదను పోగుచేసుకోవాలనే సంస్కృతి - దీనికి మద్దతిస్తున్న కార్పొరేట్‌శక్తులు.
* హద్దూ అదుపూ లేని వినియోగ సంస్కృతి.
* ధనికుల జీవనశైలి.
* ప్రకృతి వనరులను కొల్లగొట్టే రాజకీయాలు, ఆక్రమణలు, అక్రమాలు.
* పర్యావరణాన్ని నష్టపర్చగల శాస్త్ర, సాంకేతికాల ఎంపిక.
ఆహారోత్పత్తి.. సాంకేతికాలు..
భూగోళం నుండి విడుదలయ్యే మొత్తం గ్రీన్‌హౌస్ వాయువుల్లో దాదాపు 14 శాతం ఆధునిక వ్యవసాయం వల్ల విడుదలవుతున్నాయి. ఎన్నో విస్తార ప్రాంతాల్లో భూ వినియోగం, నీటి యాజమాన్యం హరిత ఆర్థికాభివృద్ధికి దోహదపడేవిగా లేవు. అడవుల నరికివేతవల్ల దాదాపు మరో 17 శాతం గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవు తున్నాయి. సుస్థిర వ్యవసాయోత్పత్తికి, అడవుల యాజమాన్యానికి, నేలకోత నివారణకు నీటి కాలుష్య నియంత్రణకు హరిత సాంకేతికాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మెట్ట ప్రాంతాల్లో, పరీవాహక ఆధారాభివృద్ధి (భూసార పరిరక్షణ, నీటి సంరక్షణ), నీటి వినియోగాన్ని తగ్గిస్తూ, ఉత్పాదకతను పెంచుతూ సేద్య విస్తీర్ణాన్ని తగ్గించే శ్రీవరి సేద్యం, సాగునీటి సామర్థ్యాన్ని పెంచే సాంకేతికాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఉపయోగించాలి.
పెట్టుబడులు..
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొత్త హరిత సాంకేతికాల అమలుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను అందించాలని ఐరాస 2011 సర్వే సూచిస్తుంది. దీనికోసం ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపు మూడు శాతం (2010లో 1.90 లక్షల కోట్ల డాలర్లు) అవసరమని ఈ సర్వే అంచనా వేసింది. పేదరికాన్ని అధిగమించడానికి, నేల, నీటి వనరుల క్షీణతను నిలువరించడానికి, ఆహారోత్పత్తిని పెంచుతూ ఆకలిని నిర్మూలించడానికి; వాతావరణమార్పుల్ని నిలువరించడానికి, రాగల ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి ఈ నిధులు అవసరం. ఈ నిధుల్లో కనీసం సగం అభివృద్ధి చెందిన దేశాలు స్థానిక వనరుల నుండే సేకరించాలని ఈ నివేదిక సూచించింది. ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పొదుపు మొత్తాలను, ఇతర ఆదాయాల్ని స్థానికంగా కాకుండా అంతర్జాతీయ నిధుల రూపంలో ఉంచుతున్నాయి. ఐచ్ఛికంగా వీటిని ఆయా దేశాల్లోనే ఉంచితే హరిత ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలవని ఈ సర్వే సూచిస్తుంది.
కోపెన్‌హాగన్ ఒప్పందంలో 2010-12 మధ్యకాలంలో వార్షికంగా మూడు వేల కోట్ల డాలర్లను, ఆ తర్వాత 2020 వరకూ 10 వేల కోట్ల డాలర్లను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ లక్ష్యం కోసం అందించాలనే నిర్ణయం సరైనదని సర్వే తెలిపింది. కానీ, ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ మార్పుల నియంత్రణకు ఏర్పర్చిన ట్రస్టు నిధుల నుండి ఏడాదికి కేవలం రెండువేల కోట్ల డాలర్లు అందాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో హరితాభివృద్ధికి వార్షికంగా లక్ష డాలర్లు అవసరమవుతుందని సర్వే అంచనా. దీనిలో ఎక్కువ భాగం అంతర్గతంగానే ఆయా దేశాలు సేకరించాల్సి ఉన్నప్పటికీ, ఆరంభంలో హరిత సాంకేతికాల మార్పును వేగం చేసేందుకు విదేశీ సహాయం తోడ్పడుతుందని సర్వే సూచించింది.
కేంద్రీకరించాల్సిన చిన్నకమతాల సేద్యం..
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్నకమతాలపై కేంద్రీకరించి, సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధించాలని 1996లో జరిగిన 'ప్రపంచ ఆహార ఉన్నతస్థాయి సమావేశం' సూచించింది. ఈ దేశాల్లో ఇప్పటికీ ఆహారం స్థానికంగా ఉత్పత్తయి, వినియోగింపబడుతున్నందువల్ల ఆహారోత్పత్తి వ్యవస్థ మొత్తం చిన్నకమతాల సేద్యం మీదనే ఆధారపడి ఉంది. అందువల్ల, హరితాభివృద్ధిలో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని 2011 ఐరాస సర్వే పునరుద్ఘాటించింది. కొత్తగా వస్తున్న సాంకేతికాల్ని చిన్న కమతాలు వినియోగించుకోలేకపోతున్నాయని పేర్కొంది. అందువల్ల, ఈ కమతాలకు అవసరమైన మద్దతు వ్యవస్థను, మౌలిక సౌకర్యాలను సమకూర్చాలని ఈ సర్వే తెలిపిింది. ముఖ్యంగా సుస్థిర సాగునీటి వ్యవస్థ, విద్య, శిక్షణ, భూమి, రుణసౌకర్యాల అందుబాటు, భరించగలిగే ధరలకు ఉత్పాదకాల అందుబాటు, మార్కెట్ మద్దతు అవసరమని ఇది తేల్చి చెప్పింది.
తిరోగమనంలో మన దేశం..
హరిత ఆర్థికాభివృద్ధికి తిరోగమన దిశలో దేశాభివృద్ధి కొనసాగుతుంది. భూగోళం వేడెక్కడాన్ని, వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతున్నాం కానీ, వీటిని నిలువరించేందుకు పై పై చర్యలకే పరిమితమవుతున్నాం. అంతు లేని వినియోగ సంస్కృతి ప్రోత్సహించబడుతోంది.
అంతర్జాతీయ ఉత్పత్తిలో భాగస్వామ్యం వలన రవాణా అవసరాలు పెరిగి, ఇంధన వాడకం పెరుగుతుంది. ప్రజా రవాణా రోడ్డు సౌకర్యాలను తగ్గిస్తూ, వ్యక్తిగత, ప్రయివేటు వాహనాల వినియోగాన్ని పెంచే అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. దీనివల్ల ఇంధన వాడకం పెరుగుతుంది. పునరుత్పత్తి కాగల ఇంధనం, ఉచితంగా, అపరిమితంగా లభించే సౌరశక్తి ఆధారిత ఇంధనం కాకుండా అతి ఖర్చు, రిస్క్‌తో కూడిన అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణం పెద్దఎత్తున చేపడు తుంది. ఇదే సమయంలో అవసరానికి మించి పెద్దఎత్తున బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టబడుతుంది. ఇవేవీ హరిత సాంకేతికాలు కావు, హరితార్థికాభివృద్ధికి తోడ్పడేవీ కావు.
సుస్థిర వ్యవసాయోత్పత్తికి దోహదపడే సాంకేతికాలు (సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ, కలుపు నియంత్రణ) అందుబాటులో ఉన్నప్పటికీ, వీటిని పక్కన పెట్టి, భారీ యంత్రాలు, అధిక రసాయనాల వినియోగంతో కూడిన వ్యవసా యరంగ కార్పొరేటీకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వాతావరణమార్పుల దుష్ప్రభావాలకు తట్టుకునే సుస్థిర వ్యవసాయ పరిశోధనలకు ఒక జాతీయ సంస్థ ఏర్పాటైంది. అందుబాటులో ఉన్న సాంప్రదాయ హరిత విజ్ఞానాన్ని పక్కకు పెట్టి, కొత్త పరిశోధనలను చేపట్టే ఔచిత్యాన్ని సమర్థించలేం.
ఎంతో అస్థిరత్వంతో కూడిన బిటి సాంకేతికాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీన్ని హరిత సాంకేతికంగా పరిగణించలేం. ఇది ఎన్నో పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణమని తెలుస్తున్నప్పటికీ, కేవలం కంపెనీల సమాచారం ఆధారంగా బిటి సాంకేతికాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
దుష్ప్రభావాల్ని ఎదుర్కోడానికి మన కార్యక్రమం..
వాతావరణమార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కోడానికి 8 అంశాలపై ప్రత్యేక జాతీయ మిషన్లను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి..
* జాతీయ సౌరశక్తి మిషన్: 20 వేల మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించింది. 2010-12లో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం.
* జాతీయ ఇంధన సామర్థ్యాన్ని పెంచే మిషన్: ఇది ప్రత్యేక వ్యవస్థాగత ఏర్పాట్ల కోసం ఉద్దేశించింది.
* జాతీయ సుస్థిర నివాసాల మిషన్: సుస్థిర రవాణా, ఇంధన సామర్థ్యంగల ఇళ్ల నిర్మాణం, పట్టణ ప్రాంతాల్లో సుస్థిర వ్యర్థ పదార్థాల యాజమాన్యాల కోసం ఇది పనిచేస్తుంది.
* జాతీయ నీటి మిషన్: నీటి వనరుల సమన్వయ వినియోగ సామర్థ్యాన్ని కనీసం 20 శాతం పెంచే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది.
* జాతీయ హిమాలయ జీవావరణ సుస్థిర మిషన్: హిమాలయ మంచు కరగడంపై వాతావరణ పర్యావరణ పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ఇది ఉద్దేశించింది.
* జాతీయ హరిత భారత మిషన్ : అదనంగా 10 మిలియన్ హెక్టార్ల నిరుపయోగ భూముల్ని, సామూహిక భూముల్ని, క్షీణించిన అటవీభూముల్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది.
* జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ : వాతావరణమార్పుల్ని తట్టుకుని, ఉత్పాదకతను పెంచేందుకు తోడ్పడే సాంకేతికాల అభివృద్ధికి ఉద్దేశించినది. మొత్తం మీద వివిధ వ్యవసాయ, వాతావరణ మండలాల్లో మౌలిక వనరులైన నీరు, భూమి తదితరాల వినియోగాన్ని మెరుగుపరిచి, జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వరదల్ని, ఇతర ప్రకృతి వైపరీత్యాల్ని, చీడ, పీడల్ని తట్టుకునేవిధంగా కొత్తరకాల్ని రూపొందించ డానికి దీని పరిశోధనలు ఉద్దేశించబడ్డాయి.
* జాతీయ వ్యూహాత్మక వాతావరణమార్పుల విజ్ఞాన మిషన్ : వాతావరణ మార్పుల వల్ల వస్తున్న సవాళ్లను గుర్తించి, సంబంధిత విజ్ఞానాన్ని, స్పందించాల్సిన అవసరాన్ని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించింది.
అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం కలిగించేలా కార్బన్ విడుదలను తగ్గించేందుకు అవసరమైన ఓ నిపుణుల గ్రూపు కూడా ఏర్పాటైంది.
మీకు తెలుసా?
* సుస్థిరాభివృద్ధి: ఇప్పటి వనరులను అస్థిరపర్చకుండా, నేడు, పెరుగుతున్న భవిష్యత్తరాల అభివృద్ధి అవసరాలను తీర్చుకొనడం.
* హరితార్థికాభివృద్ధి (సుస్థిరాభివృద్ధి): భవిష్యత్తరాల భద్రతను ఫణంగా పెట్టకుండా భూ, జీవ పర్యావరణాల్ని పరిరక్షిస్తూ, పెరుగుతున్న అభివృద్ధి అవసరాలను తీర్చుకోవడం.
* గ్రీన్ టెక్నాలజీస్: హరితాభివృద్ధికి దోహదపడే సాంకేతికాలు.
వాతావరణమార్పుల్ని తట్టుకొనే సాంకేతికాలు..
వాతావరణమార్పుల్ని తట్టుకోడానికి ఇప్పటికే 165 సాంకేతికాలు వినియోగిస్తున్నట్లు '2011 ప్రపంచ ఆర్థిక, సామాజిక ఐక్యరాజ్యసమితి సర్వే' నివేదిక తెలుపుతుంది. దీనిలో 42 సాంకేతికాలు (25.5 శాతం) వ్యవసాయం, సంబంధిత రంగాలలో వినియోగింపబడుతున్నాయి. నీటి వనరుల వినియోగంలో 28 రకాల సాంకేతికాలు (17 శాతం)లో ఉన్నాయి. తీరప్రాంతాల్లో 27 సాంకేతి కాలు (16.4 శాతం)లో ఉన్నాయి. మౌలిక రంగంలో 23 సాంకేతికాలు (13.9 శాతం)లో ఉన్నాయి. ఆరోగ్యం, వాతావరణం ముందు హెచ్చరికలు, భూతల జీవావరణం వంటి రంగాలలో మిగతావి వినియోగించబడుతున్నాయి.
మొత్తం సాంప్రదాయ సాంకేతికాల్లో 67 శాతం వాతావరణమార్పులను ఎదుర్కోడానికి వినియోగపడుతున్నాయి. పారిశ్రామికవిప్లవం తర్వాత రూపొందించిన ఆధునిక సాంకేతికాల్లో 57 శాతం సాంకేతికాలు వాతావరణ మార్పుల్ని ఎదుర్కోడానికి దోహదపడుతున్నాయి. ఇక, ఇటీవల రూపొందించిన సాంకేతికాల్లో కేవలం 41 శాతం వాతావరణమార్పుల్ని ఎదుర్కోడానికి దోహద పడుతున్నాయి. ఇవి ప్రధానంగా వాతావరణాన్ని పసిగట్టడంలో, ముందస్తు హెచ్చరికలు జారీచేయడంలో ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత ఆరోగ్యరంగంలో ఉన్నాయి.
వ్యవసాయరంగంలో వినియోగిస్తున్న సాంకేతికాల్లో 47.6 శాతం సాంప్రదాయ సాంకేతికాలు, 31 శాతం ఆధునిక సాంకేతికాలు, కేవలం 21 శాతం మాత్రమే ఇటీవల రూపొందించిన సాంకేతికాలు.
ఇంధన రంగంలో వాతావరణమార్పుల్ని ఎదుర్కోడంలో 66.7 శాతం సాంప్రదాయ సాంకేతికాలు ఉపయోగపడుతున్నాయి. 33.3 శాతం ఆధునిక సాంకేతికాలు. వాతావరణమార్పుల్ని ఎదుర్కోడానికి ఉపయోగపడ్తున్నాయి. ఇటీవల కాలంలో ఏ కొత్త ఇంధన సాంకేతికం దీనికి దోహదపడటం లేదు.
భూతల పర్యావరణ వ్యవస్థ సాంకేతికాల్లో 75 శాతం సాంప్రదాయ సాంకేతికాలు వాతావరణమార్పుల్ని ఎదుర్కోడానికి దోహదపడుతున్నాయి. మిగతావి పారిశ్రామిక విప్లవకాలంలో రూపొందినవి. ఈ రంగంలో దీనికోసం ఇటీవల ఏ కొత్త సాంకేతిక విజ్ఞానమూ రూపొందలేదు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
Agni-V set to soar today
The Hindu A model of Agni-V being displayed at a press meet. File photo
Country's longest range missile can take out targets 5000 km away
Agni-V, India's most powerful ballistic missile with the longest range, is all set to lift off from Wheeler Island, off the Odisha coast, on Wednesday evening. It can take out targets 5000 km away.
Although it is of the class of an Intermediate Range Ballistic Missile (IRBM), the success of the mission will enable India join a select band of nations with capability to design, develop and produce Inter-Continental Ballistic Missiles (ICBMs).
Many crucial technologies will be tested during the flight of the missile, whose three stages are being propelled by solid fuel. The test will last 18 to 20 minutes before the missile impacts the target point deep inside the Indian Ocean.
The 17-metre-long and 50-tonne missile can carry a 1.1-tonne nuclear warhead. However, in this mission, it will carry a dummy payload.
A few hundred scientists and missile technologists have been working round-the-clock for the past many days to integrate the sub-systems of the missile, which was uploaded late on Tuesday evening on to the trailer of the road mobile launcher.
V.K. Saraswat, Scientific Adviser to the Defence Minister, told The Hindu, the launch will mark a “historic day.” “Agni-V is a game-changer and a technological marvel. It is a weapon which can perform multiple functions.” It could be used for anti-satellite capability, for putting micro and nano satellites in orbit and carry multiple warheads.
Dr. Saraswat said it was comparable to the missiles of this class developed by the U.S., France, Russia and China. He said the performance of the systems during the phase three and four tests had been good and satisfactory.
Avinash Chander, Chief Controller (missiles and strategic systems), Defence Research and Development Organisation, said: “This is the first time India will have a true deterrence. We had a good deterrence with Agni-III and an upgrade with Agni-IV. But Agni-V gives you a total quantum jump in that capability.”
He said that it could be launched from a canister giving India the “stop-and-launch” capability. It could be stopped on the roadside and launched, providing it great mobility.
V.G. Sekaran, director, Advanced Systems Laboratory (ASL), Hyderabad, said the missile's second stage motor casing made of carbon composite had led to drastic reduction in the weight. This would lead to higher performance. Describing it as a “user-friendly” missile, he said its footprint was the same as Agni-III. There was tremendous potential for achieving higher ranges, he added.
సూర్యుడి తోబుట్టువులు
-
నిర్వహణ: గోపాలం కెబి gopalvy@gmail.com
-
16/04/2012
TAGS:

మన సూర్యుడిని ఒంటరి నక్షత్రం అంటుంటారు. సూర్యుడి కాంతి దగ్గరలోని మరో నక్షత్రానికి చేరడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. అలాగని సూర్యుడు మొదటి నుంచీ ఒంటరి నక్షత్రమేనా? సుమారు నాలుగున్నర బిలియన్ సంవత్సరాల నాడు ఈ సూర్యుడు దుమ్ము, వాయువులు కలిగిన ఒక మేఘం నుంచి పుట్టిన సంగతి తెలుసు. అదే సమయంలో ఆ పదార్థం నుంచి మరిన్ని నక్షత్రాలు కూడా పుట్టాయి. అవి సూర్యుడి తోబుట్టువులు. వీటన్నిటికీ పదార్థం అందించిన ఆ ధూళి మేఘం సమసిపోయింది. కానీ, అందులోనుంచి పుట్టిన నక్షత్రాలన్నీ పోలేదు. ఈ ఆలోచనకు ఆధారాలున్నాయి. సౌర మండలం పుట్టినప్పుడు కొంత పదార్థం అక్కడక్కడ చెదిరి మిగిలిపోయింది. వాటిలోని రసాయనాలను పరిశీలించిన తర్వాత, కొన్ని సంగతులను పరిశోధకులు చెప్పగలిగారు. సూర్యుడికి ఒక కాంతి సంవత్సరం కన్నా తక్కువ దూరంలోనే మరో నక్షత్రం పుట్టిందనీ, అది మరీ పెద్దది గనుక పేలిపోయిందనీ లెక్క తేలింది.
సూర్యుడి లాంటి కొలతలు, లక్షణాలున్న నక్షత్రాలన్నీ గుంపులుగానే ఉన్నాయని ఖగోళ పరిశోధకులు గమనించారు. వందల వేల సంఖ్యలో ఈ నక్షత్రాలు చెల్లా చెదురయినట్లు కూడా గమనించారు. అంగారక శిలలు, అంతరిక్ష శిలలలోని రసాయనాలను గమనించినప్పుడు మన సూర్యనక్షత్రం కూడా ఇలాంటి గుంపులో ఉండేదన్న సూచనలు కనబడుతున్నాయి. సూర్యుడు పుట్టిన ఆ గుంపులో కనీసం వెయ్యి నక్షత్రాలు ఉండి తీరాలని పరిశోధకుల అభిప్రాయం.
పాలపుంతలో కోటానుకోట్ల నక్షత్రాలున్నాయి. వాటిలో ఈ వెయ్యి నక్షత్రాలను వెదకడం సులభమయిన పని కాదు. అందునా నక్షత్రాల చరిత్ర మనుషుల చరిత్రలాగే విచిత్రంగా ఉంటుంది. నక్షత్రాల గుంపులు పుట్టి గెలాక్సీగా విస్తరిస్తాయి. అందులోని బలాల కారణంగా నక్షత్రాలు నాశనమయ్యేవీలుంది. నక్షత్రాలు పుట్టడానికి ఆధారమయిన దుమ్ము వాయువుల మేఘమే వాటికి మొదటి శత్రువు. ఈ మేఘాలు నక్షత్రాలకన్నా కోట్ల రెట్లు ఎక్కువ పదార్థం గలవి. వాటికి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కొత్త నక్షత్రాలు మరీ దూరాలకు విసిరివేయబడతాయి. ఈలోగా రకరకాల ప్రభావాలకు గురై కొన్ని నక్షత్రాలు వెంటనే పేలిపోతాయి కూడా. పుట్టిన కొత్త నక్షత్రాలు ఒక గుంపుగా ఉండటానికి వాటి మధ్య గల గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఆధారం. పేలిన నక్షత్రంలోని పదార్థం చుట్టూ చిమ్మినపుడు ఈ శక్తికి తెరలాగ అడ్డువస్తుంది. అంటే నక్షత్రాలు గుంపుగా ఉండక చెదిరిపోతాయి. ఇక వాటి మీద గెలాక్సీలోని శక్తులు పనిచేస్తాయి. మిగతా నక్షత్రాల ఆకర్షణ పనిచేస్తుంది. మొత్తానికి గుంపులోని నక్షత్రాలు చెదిరిపోతాయి. రకరకాల కారణంగా కుటుంబంలోని వారంతా చెదిరిపోయిన ‘సినిమా’ జీవితకథలాంటి పరిస్థితి ఇది!
సినిమాలో కుటుంబం ఏదో ఒక రకంగా, తిరిగి కలిసినట్లు చూపిస్తారు. సూర్యుడి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తిరిగి దగ్గరకు రాకపోవచ్చు. కానీ, అవన్నీ దగ్గరలోనే ఎక్కడో ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో పరిశోధకులు సూర్యుడి చుట్టాల గురించి లెక్కలు వేశారు. సుమారు 330 కాంతి సంవత్సరాల దూరంలో, అలనాడు సూర్యుడితోబాటు పుట్టిన నక్షత్రాలు ఉండి తీరాలని వారు లెక్క చెపుతున్నారు. సూర్యుడంత నక్షత్రం అంతదూరంలో ఉంటే, బైనాక్యులర్స్‌లో నుంచి చూడవచ్చు. కానీ ఈ లెక్కను అందరూ ఒప్పుకోవడం లేదు. నక్షత్రాలు చెదిరి ఒకదాని నుంచి మరొకటి దూరం పోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని, ఈ 330 కాంతి సంవత్సరాలు లెక్క, ఆ బలాల ముందు నిలబడదనీ అంటారు మరికొందరు పరిశోధకులు. ఉంటే, ఏవో కొన్ని నక్షత్రాలు మాత్రమే ఆ దూరంలో ఉండవచ్చునని వారి లెక్కలు చెపుతున్నాయట.
ఎన్ని నక్షత్రాలు, ఎంత దగ్గరలో ఉన్నాయన్న లెక్కలు సాగుతుండగానే, మరికొందరు వాటి కొరకు వెదకులాట మొదలుపెట్టారు. అందుకోసం హెర్మెస్ అనే ప్రత్యేక పరికరాన్ని కూడా తయారుచేయించారు. న్యూసౌత్‌వేల్స్‌లో కువాబరాబ్రాన్ అనే చోట, ఇంగ్లీషువారు, ఆస్ట్రేలియనులు కలిసి స్థాపించిన సైడింగ్ స్ప్రింగ్ నక్షత్ర పరిశోధనశాలలో ఆ పరికరాన్ని టెలిస్కోప్‌కు సాయంగా కలిపారు. ఇరవయివేల కాంతి నక్షత్రాల దూరం లోపలగల నక్షత్రాలను టెలిస్కోపులు ఊరికే చూస్తుంటాయి. హెర్మెస్ మాత్రం వాటిలోని రసాయనాల తీరుతెన్నులను కూడా గమనిస్తుంది. మన చుట్టాలను మరో దేశంలో వెతకాలంటే భాష, సంస్కృతి ఆధారంగా వెదికినట్లు ఉంటుంది ఈ అనే్వషణ.
కనిపించిన ప్రతి నక్షత్రంలోనూ ఇరవయి అయిదు రకాల రసాయనాల తీరును గురించి ఈ పరికరం వివరాలను గమనిస్తుంది. వాటి ఆధారంగా నక్షత్రం పుట్టుక రహస్యాలు అర్థమవుతాయి. ఇదే దారిలో సూర్యుడిని పోలిన రసాయనాలున్న నక్షత్రాలు కనబడితే, అవి తప్పకుండా సూర్యుడి తోబుట్టువులుగా గుర్తింపబడతాయి. పది సంవత్సరాలపాటు కష్టపడితే, మనం వెతుకుతున్న రకం చుక్కల హద్దులు తెలిసే వీలు ఉండవచ్చునంటారు పరిశోధకులు. అక్కడితో కథ ముగిస్తే బాగానే ఉంటుంది. నక్షత్రాలు ఎంతగా విసిరివేయబడినా, వాటి కదలికలో కూడా సూర్యుడికి పోలికలు ఉంటాయి. నక్షత్రాల దారులను గమనించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీవారు వచ్చే సంవత్సరం గైయా అనే అంతరిక్ష నౌకను పంపుతున్నారు. అది తీసిన కదలికల కొలతలకు, హెర్మెస్ రసాయనాలు కొలతలకు పొంతన కుదరాలి. రెండు పరీక్షలలో నిలిచినవి, గెలిచినవీ మాత్రమే సూర్యుడితో సహా పుట్టిన నక్షత్రాలు అనిపించుకుంటాయి.
ఈలోగా సూర్యుని చుట్టాల కొరకు మాత్రమే కాక, మొత్తంమీద లక్ష నక్షత్రాలను గమనించి, రసాయన సమాచారాన్ని కూడా సేకరించే మరో పరిశోధన న్యూమెక్సికోలో మొదలుకానుంది. అందులో అనుకోకుండా ‘మన’ సూర్యుడు లాంటి, ‘మన’ నక్షత్రాలు తగలవచ్చు. ఈ పరీక్షలో నక్షత్రాల వయసులను కూడా అంచనా వేయనున్నారు. సూర్యుడిలాంటి రసాయనాలు, కదలికలతోబాటు, అదే వయసున్న నక్షత్రాలు కనబడితే అవి తప్పకుండా ‘మన’ నక్షత్రాలే అనక తప్పదు. వాటిని కనుగొన్నందుకు ఏం దక్కుతుందని ఎవరికయినా అనుమానం రావచ్చు. ముందు సూర్యుడు, సౌరమండలం ఏర్పడిన తీరు మరింత అర్థమవుతుంది. ఆయా నక్షత్రాల గ్రహాల మీద, జీవం ఉండే వీలు కూడా ఎక్కువగా ఉంటుంది.
మొత్తానికి ఇదంతా మనలాంటి వారి గురించి వెదుకులాటలో భాగమా?
మన ఉపగ్రహ ప్రస్థానం
భారతదేశపు మొదటి స్పేస్ శాటిలైట్ ఆర్యభట్ట 1975, ఏప్రిల్ 19న ప్రయోగింపబడింది.
భూమిని పరిశీలించడానికి నిర్మించిన భాస్కర ఉపగ్రహాన్ని 1979, జూన్ ఏడున ప్రయోగించారు.
1980, జూలై 18న భారతదేశం తన ఉపగ్రహాన్ని తానే ప్రయోగించింది. శ్రీహరికోట రాకేట్ కేంద్రం నుంచి శాటిలైట్ లాంచ్ వియకిల్ అనే రాకెట్ మీద రోహిణి - 1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
ఆ తరువాత అంతరిక్ష ఉపగ్రహాల రంగంలో మన దేశం ఎంతో ప్రగతి సాధించింది. వేరు వేరు ఉపయోగాల కొరకు రకరకాల ఉపగ్రహాలను ప్రయోగించింది. రిమోట్ సెన్సింగ్, సమాచార ప్రసార రంగాలలో ప్రగతి ఉపగ్రహాల వల్లనే వీలయింది.
1985 చివరి నాటికి రోహిణి - 3 ఉపగ్రహం ఆధారంగా దేశంలో 70 శాతం జనాభాకు టీవీ అందుబాటులోకి వచ్చింది.
ఎఎస్‌ఎల్‌వీ, జిఎస్‌ఎల్‌వీ, పిఎస్‌ఎల్‌వీ లాంటి లాంచ్ రాకెట్లను మన దేశంలోనే నిర్మించారు.
ఇన్‌సాట్ క్రమంలో వచ్చిన ఉపగ్రహాలు సమాచార రంగాన్ని పూర్తిగా మార్చివేశాయి.
2003 సంవత్సరంలో ఇన్‌సాట్ - 3 ఏ ప్రయోగింపబడింది. ఈ ఉపగ్రహాన్ని నిర్మించింది మన దేశంలోనే అయినా, ఇన్సాట్ ఉపగ్రహాలన్నీ ఫ్రాన్స్ నుంచి అంతరిక్షంలోకి చేరుకున్నాయి.
2007 మార్చి 12న ఇన్సాట్ క్రమంలోని 4 - బి ప్రయోగింపబడింది. ఇది త్రీ-ఏతో కలిసి పనిచేస్తున్నది.
________________________________________________________________
తెలుగు ప్రజల ముద్దుబిడ్డ కందుకూరి
మురిపెముంతో కన్నదమ్మా గోదావరీ
మూఢత్వం మూర్ఖత్వం ఎదిరించిన సాహసి
విజ్ఞానం వికాసం అందించిన సమరశీలి
జాతకాలు, చేతబడులు బలహీనుల నమ్మకం
నమ్మకాల వ్యాపారం మౌఢ్యస్తుల పన్నాగం
అంధవిశ్వాసాలు ప్రగతికడ్డు అన్నావు,
కపట నాటకాల వారి గుట్టు బయట పెట్టావు.
పసివాళ్లకి పెళ్ళిళ్లు వితంతువులకు బొడిగుళ్లు
సామాజిక దురాచారం నాగరికతకవమానం
చదువు సంధ్యలున్న స్త్రీలు మనగౌరవమన్నావు
హితకారిణి సమాజాన్ని అమ్మవై సాకావు
చిరిగిన చొక్కానయినా తొడుక్కోమ్మని
ఒక మంచి పుస్తకం మాత్రం కొనుకోమ్మని
సైన్సు పుస్తకాలు మాస పత్రికలతో
దురాచార జగతికి దుమ్ము వదలగొట్టావు
విజ్ఞానం సమన్యాయం కందుకూరి కళ్ళు
శాస్త్రీయ దృష్టినిచ్చి కడిగావు కుళ్ళు
నీ మాటను నీ బాటను మేము అనుసరిస్తాము
విజ్ఞానపు వెలుగును లోకమంత పంచుతాము.
- డాక్టర్ చల్లా రవికుమార్,
9440507775
_____________________________________________________________________
Share రక్ష డెస్క్ Mon, 9 Apr 2012, IST

సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వివిధ రకాల కీటకాల వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. వాటిలో ముఖ్యంగా ఆహారం/నీటి వల్ల వచ్చే వ్యాధులు (టైఫాయిడ్, కలరా, విరేచనాలు), అమ్మవారు (చికెన్‌ఫాక్స్). దోమల నుంచి వచ్చే వ్యాధులు (డెంగ్యు, మలేరియా). చర్మ సంబంధిత వ్యాధులు పొక్కులు దద్దుర్లు వస్తాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల దగ్గు, జలుబు, జ్వరం తరచుగా వస్తాయి.
టైఫాయిడ్ ఆహారం లేదా నీటిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ చేరినప్పుడు సాల్మొనెల్లటైఫీ అనే సూక్ష్మజీవి ద్వారా వ్యాప్తిచెందుతుంది. ఈ బ్యాక్టీరియా తినే ఆహారం ద్వారా చిన్న పేగుల్లోకి చేరి, జ్వరం (104 డిగ్రీల ఫారెనహీట్), విపరీతంగా చెమటలు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి నాలుగు దశల్లో ఉంటుంది. ఒక్కో దశ ఒక్కోవారం ఉంటుంది. వైడాల్ పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. దీని తర్వాత మలేరియా సర్వసాధారణంగా కనిపిస్తుంది. జ్వరం, తలనొప్పి మలే రియాలో కనిపి ిస్తాయి. మలేరియా తీవ్రత అధికమైతే కోమాలోకి వెళ్లిపోవడం లేదా చనిపోయే అవకాశాలున్నాయి. జ్వరం, వణుకు, ఒళ్లునొప్పులు, వాంతులు, రక్తహీనత, పచ్చకామెర్లు, మూర్ఛ మలేరియా లక్షణాలు. మొదట చలి, తర్వాత వణుకు, జ్వరం, వెంటనే చెమటలు పట్టడం కనిపిస్తాయి.
ఈ వ్యాధులకు హోమియోపతి వైద్యంలో చికిత్స చేస్తారు. వ్యాధిని మూలకారణం నుంచి తీసేసి రోగినిరోధక వ్యవస్థను పెంచుతూ తత్వం బట్టి మందు ఇచ్చి నివారిస్తారు.
చికిత్సతోపాటు వ్యాధులు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...
* పూర్తిగా ఉడకబెట్టిన ఆహారపదార్థాలను తీసుకోవాలి.
* ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి.
* రోజూ సుమారు 6 నుంచి 8 లీటర్ల నీళ్లను తీసుకోవాలి.
* ఎక్కువగా కాయగూరలు, ఆకుకూరలు తీసుకోవాలి.
* ఎక్కువగా ఎండలో తిరగకూడదు. కాటన్ బట్టలు ధరించాలి.
డాక్టర్ టి.కిరణ్ కుమార్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్.
ఫోన్ : 9290901002
విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 11 Apr 2012,

భూగోళ వాతావరణమార్పులు దీనిపై నివసిస్తున్న జీవాల మనుగడని, కార్యక్రమాల్ని, పరిణామ క్రమాల్ని నిర్ధారిస్తున్నాయి. ఈ మార్పులు మానవ మనుగడ, సంస్కృతి, అభివృద్ధిపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. భూగోళ వాతావరణంలో వచ్చిన తీవ్ర, ఆకస్మిక మార్పులు ఆయా సమయాల్లో ఉన్న జీవరాశుల్ని అంతరింపజేశాయి. తన జీవితకాలంలో ఎంతో శక్తివంతమైన డైనోసార్స్ వంటి జంతువులు ఈ మార్పుల వల్లే అంతరించిపోయాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. అంటే, నేడు భూమిపై మనం చూస్తున్న జీవరాశులు ఎన్నో మార్పులకులోనై పునరుద్ధరింపబడి జీవిస్తున్నాయి. ఇక భూగోళ వాతావరణంలో ప్రస్తుతం వచ్చిన, వస్తున్న చిన్నపాటి మార్పులు కూడా అన్ని జీవాల మనుగడకు, అభివృద్ధికి సవాల్‌గా నిలుస్తున్నాయి. ఈ మార్పుల్లో భూగోళ వాతావరణం క్రమంగా వేడెక్కడం ఒక ముఖ్యభాగం. ఇది సాధించిన అభివృద్ధిని వమ్ము చేసేదిగా ఉంది. ఈ నేపథ్యంలో భూగోళ వాతావరణమార్పుల్ని నివారించి, స్థిరీకరించాల్సిన ప్రాముఖ్యతను అందరిచే గుర్తింపజేసే లక్ష్యంతో 'అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవాన్ని' ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరపాలని ఐక్య రాజ్యసమితి 2009లో నిర్ణయించింది. 2012 భూగోళ దినోత్సవాన్ని ''సుస్థిర భవిష్యత్తు కోసం, లెక్కించగల పరిణామ లక్ష్యాల్ని సాధించేందుకు అన్ని గళాల్నీ ఏకం చేసేలా కార్యక్రమాలు రూపొం దించింది. ఈ నేపథ్యంలో, భూగోళ వాతావరణమార్పులు, స్థిరీకరణలో ఇమిడిన ప్రధానాంశాలను క్లుప్తంగా తెలుపుతూ మొదటిభాగంగా ఈ వారం మీ ముందుకు వచ్చింది 'విజ్ఞానవీచిక'.
ధరిత్రీ దినోత్సవ ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలంటే భూగోళ, మానవ పరిణామక్రమాల్ని అర్థంచేసుకోవాలి. భూగోళ పరిణామక్రమం కొనసాగుతున్నప్పటికీ ఫృథ్వీపై వివిధ జీవరాశుల ఆవిర్భావం, పరిణామక్రమం కూడా కొనసాగింది.
భూగోళ ఆవిర్భావం.. పరిణామం..
భూగోళం దాదాపు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. అప్పుడు ఇది కేవలం కరిగిపోయిన 'రాయి ముద్ద'గా ఉండేది. ఆ సమయంలో దాని ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 4000 డిగ్రీల సెంటీగ్రేడ్. చల్లారి, పైన గట్టిపొర ఏర్పడడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందని అంచనా వేశారు.
విశ్వంలో ఎన్నో గ్రహాల చుట్టూ ఎటువంటి వాతావరణం ఇప్పటికీ లేదు. ఈ విధంగానే, భూగోళం ప్రారంభమైనప్పుడూ దానిపై ఏ ప్రత్యేక వాతావరణమూ లేదు. కానీ, అగ్నిపర్వతాల పేలుడుతో వెలువడిన వాయువుల వల్ల 'ప్రాథమిక వాతావరణం' ఏర్పడింది. అయితే, దానిలో ఆక్సిజన్ లేదు. మొదట జీవం (బ్లూ గ్రీన్ ఆల్గే) దాదాపు 350 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇది ఆక్సిజన్ అవసరం లేకుండా జీవించింది. మొక్కలు ఆవిర్భవించిన తర్వాతనే ఆక్సిజన్ ప్రధానంగా విడుదలై వాతావరణంలో చేరింది. దాదాపు 100 కోట్ల సంవత్సరాల క్రితమే ప్రాథమిక జంతువులు ఆవిర్భవించాయి. అయితే, 55 కోట్ల సంవత్సరాల క్రితం భూగోళంపై జీవాలు ఒకేసారి వేగంగా ఏర్పడి, విస్తరించినట్లు కూడా ఈ సాక్ష్యాలు తెలుపుతున్నాయి. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఆవిర్భవించాయి. కానీ, 13.5 కోట్ల సంవత్సరాల తర్వాత (ఇప్పటికి ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం) అవి పూర్తిగా అంతరించాయి. అయితే, ఆదిమానవుడు దాదాపు 20 లక్షల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించాడు.
మానవ పరిణామక్రమం..
మానవుడు కోతి నుండి పరిణామం చెంది చక్కగా నిలుచునే వరకూ వేగంగా మార్పులు జరిగాయి. వాతావరణ పరిస్థితులనుబట్టి పొడుగ్గానో, పొట్టిగానో, లావుగానో, సన్నగానో లేదా నలుపుగానో, తెలుపుగానో ఉండేవాడు. కానీ, ఆకృతుల్లో మనుషులంతా ఒకేలా ఉండేవారు. పరిసరాలకు అనుగుణంగా జీవనశైలిని రూపొందించుకునే ప్రక్రియలో వివిధ సంస్కృతులూ వచ్చాయి.
దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం చెట్లను ఎలా పెంచుకోవాలో? కొన్ని జంతువుల్ని సాధు జంతువులుగా ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నారు. దీనితో మానవులు స్థిర నివాసాలు (ఇప్పటి గ్రామాలు, ఆ తర్వాత పట్టణాలు) ఏర్పర్చుకున్నారు. మానవ సంబంధాలూ ఏర్పడ్డాయి. వివిధ వాతావరణ పరిస్థితులు భిన్న సంస్కృతులకు దోహదపడ్డాయి. ఉత్పత్తి క్రమంలో వచ్చిన మార్పులు ఆ తర్వాత ఏర్పడిన సమాజ చరిత్రకు దోహదపడ్డాయి.
గుంపులతో ప్రారంభమైన మానవాభివృద్ధి చరిత్ర చిన్న, చిన్న సమూహ నివాస ప్రాంతాలుగా, రాజ్యాలుగా, బానిస సమాజంగా, భూస్వామ్య సమాజంగా, పెట్టుబడిదారీ సమాజంగా, సోషలిస్టు సమాజంగా పరిణామం చెందాయి. ఈ పరిణామక్రమం అన్ని ప్రాంతాల్లో ఒకేలా సరళరేఖలా కాకుండా ఎగుడు, దిగుడులతో కూడుకొన్నది. ఇది వేరే విషయం. మానవ విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ 18, 19వ శతాబ్ధాలలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. ఇది వేగవంతమైన మార్పులకు దారి తీసింది ఈ కాలంలోనే. సైన్స్ వేగంగా అభివృద్ధి చెందింది. తద్వారా ఆధునిక విజ్ఞానం ఏర్పడింది. ఇదే సమయంలో యుద్ధ తంత్రాలూ పెరిగాయి. విజ్ఞానం ఒకవైపు మానవ సౌకర్యాల అభివృద్ధికీ దోహదపడుతూనే మరోవైపు భూగోళ అస్థిరత్వానికీ దోహదపడుతుంది. అంటే, పెద్దఎత్తున జరిగే యుద్ధాలకూ కారణమవుతుంది. ఆకస్మిక మార్పుల వల్ల భూగోళం మీద ఉన్న జీవాలు 5, 6 సార్లు పూర్తిగా లేదా పాక్షికంగా అంతరించిపోయాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
రాగల ఈ దుష్పరిణామాల్ని నివారించడానికి, భూగోళాన్ని, దాని వాతావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తింప చేయడానికి ధరిత్రీ దినోత్సవం ప్రతి సంవత్సరం జరపాలని నిర్ణయించారు. ఇది అమెరికాలో 1970లో ప్రారంభమైంది. 1970 ఏప్రిల్ 22ను 'ఆధునిక పర్యావరణ ఉద్యమ పుట్టుక'కు చిహ్నంగా తీసుకున్నారు. అంతకంటే ముందే 1962లో 'రాచెల్ కార్సన్' అనే శాస్త్రజ్ఞుడు సైలెంట్ స్ప్రింగ్ అనే పేరుతో వివిధ రసాయనాలు కాలుష్యాన్ని, పర్యావరణానికి ఎలా నష్టాల్ని కలిగిస్తాయో తెలిపారు. ఇది పర్యావరణ పరిశోధనలకు, ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది.
వాతావరణ మార్పులు..
భూగోళ వాతావరణంలో మార్పులు మొత్తంగాగానీ, కొన్ని ప్రాంతాలకుగానీ పరిమితమై ఉండవచ్చు. ఈ మార్పులు కొన్ని లక్షల సంవత్సరాల నుండి లేక కొన్ని శతాబ్దాలు లేదా దశాబ్దాల కాలంగా కొనసాగవచ్చు. ఈ మార్పులు సహజ లేదా మానవ కార్యకలాపాల వల్ల జరగవచ్చు.
ప్రకృతి పరిణామాలు, మానవుడి జీవనశైలి వల్ల కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రేట్ ఆక్సైడ్‌లు విడుదల అవుతున్నాయి. ఇవి వాతావరణంలో క్రమంగా చేరి, కొనసాగుతున్నాయి. భూగోళం మీద సూర్యరశ్మి పడినప్పుడు కొంతభాగం తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతుంది. ఇలా పరావర్తనం చెందిన సూర్యరశ్మి వాతావరణాన్ని విడిపోకుండా ఈ వాయువులు అడ్డుకుంటున్నాయి. వేడెక్కుతాయి. ఈ వేడిని తిరిగి భూమి వైపు పరావర్తనం చెందిస్తున్నాయి. వాతావరణాన్నీ వేడెక్కిస్తు న్నాయి. ఇలా వేడెక్కడం వల్ల భూగోళం మీద చలి తగ్గి, ఉష్ణోగ్రత పెరిగి, ఎన్నో కొత్త జీవాలు, ముఖ్యంగా చెట్లు ఆవిర్భావించాయి. దీనివల్ల భూగోళం మీద మంచు కరిగిపో యింది. ఇలా వేడెక్కిన భూగోళం సగటు వాతావరణ ఉష్ణోగ్రత ఇప్పటికన్నా కనీసం 30 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. అంటే, ఇప్పుడు భూగోళం మీద ఉన్న జీవాల్లో ఎక్కువభాగం ప్రకృతిలో సహజంగా కొనసాగిన గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావంవల్ల ఆవిర్భించాయని చెప్పవచ్చు. అయితే, మానవ కార్యకలాపాల వల్లా ఈ వాయువుల విడుదల ఎక్కువైంది. ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం తర్వాత, కేవలం 1970-2004 మధ్యకాలంలో వాతావరణంలో ఈ వాయువు లు 70 శాతం పెరిగాయి. ఈ వాయువులే కాక, వివిధ అవసరాల కోసం మానవులు ఉత్పత్తి చేస్తున్న క్లోరోఫ్లోరో కార్బన్‌లు, హైడ్రో క్లోరో కార్బన్‌లు, ఫర్‌ఫ్లూరో కార్బన్‌లు, సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్‌లు కూడా వాతావరణాన్ని వేడెక్కేలా చేస్తున్నాయి. ఇలా సగటు ఉష్ణోగ్రత పెరగటాన్ని 'భూగోళ వాతావరణం వేడెక్కడం' (గ్లోబల్ వార్మింగ్) గా వ్యవహరిస్తున్నాం.
ఇలా వేడెక్కడం వల్ల భూగోళంలో ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా, మన దేశంలో వర్షాల రాకపోకల్లో ఎన్నో మార్పుల్ని చూస్తున్నాం. వీటిలో అనిశ్చిత కూడా పెరుగుతుంది. ఈ మార్పుల ప్రభావం దీర్ఘకాలం (వందేళ్ల వరకూ) కొనసాగుతాయి. అందువల్ల, భూగోళం వేడెక్కకుండా తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలి. వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రత పెరుగుతున్న కొద్దీ వేడెక్కడమూ పెరుగుతుంది. ఇప్పటి స్థితే కొనసాగితే 21వ శతాబ్ధంలో సగటు ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల..
ఈ వాయువుల విడుదల, భూగోళ వాతావరణమార్పులు ఉత్పత్తిలో వినియోగించే శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం మీద, ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల మీద, దౌత్య సంబంధాల (యుద్ధాలు, మౌలిక వనరుల దుర్వినియోగం) మీద, రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది. విశ్వజనావళికి ఆధారంగా ఉన్నది ఒక్కటే భూగోళం. దీని వాతావరణాన్నే అందరూ పంచుకోవాలి. 1992లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయిలో జరిగిన వాతావరణ మార్పులపై జరిగిన సమావేశంలో (క్యోటో ఒప్పందం) గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను పరిమితం చేయడానికి అన్నిదేశాలూ వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించబడింది. ప్రారంభ చర్యగా కనీసం 2000 సంవత్సరానికి గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను 1990 స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించారు. కానీ, ఇది అమలు కాలేదు. 1990-2005 మధ్యకాలంలో అభివృద్ధి చెందిన 40 దేశాలలో 26 దేశాల కార్బన్ డై ఆక్సైడ్, గ్రీన్ హౌస్ వాయువుల విడుదల పెరిగింది. కానీ, ఇదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు వాయువుల విడుదల 39 శాతం తగ్గింది. అంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ జీవనశైలిని, ఆర్థిక కార్యక్రమాలను, సాంకేతికాలను మార్చుకుని, గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను పరిమితం చేసినప్పుడే భూగోళ వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను లక్ష్యానికి అనుగుణంగా పరిమితమవుతుంది. అంతే తప్ప ఒక్క అభివృద్ధి చెందుతున్న దేశాలే ఈ వాయువుల విడుదలని కట్టడి చేసి, భూగోళం వేడెక్కడాన్ని అడ్డుకోలేవు. దురదృష్టంగా అత్యధిక కార్బన్ డై ఆక్సైడ్ వాయువుల్ని విడుదల చేస్తున్న అమెరికా పై ఒప్పందం మీద సంతకం చేయలేదు. కానీ, భారతదేశంలాంటి అభివృద్ధి చెందిన దేశాలు గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను పరిమితం చేయడానికి ఎంతో ఖర్చుతో కూడిన సాంకేతికాలను చేపడ్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల మాత్రం కాలుష్యం బాగా కలిగించే పరిశ్రమలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలిస్తూ లేదా కార్బన్ క్రెడిట్‌లను కొనుగోలు చేస్తూ అసలు బాధ్యత నుండి తప్పించుకుంటున్నాయి.
అభివృద్ధి చెందిన దేశాలు గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను తగ్గించే సాంకేతికాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వడం ద్వారా రాగల లాభాల అంచనాపైనే కేంద్రీకరిస్తున్నాయే తప్ప, తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యతను నెరవేర్చడం లేదు.
ఒక అంచనా ప్రకారం గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల, రిస్క్‌ను తగ్గించడానికి మొత్తం ప్రపంచ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం ఖర్చయితే, ఈ ఖర్చు చేయకుండా మానివేస్తే వచ్చే దుష్ప్రరిణామాల్ని ఎదుర్కోడానికి 20 రెట్లు అధికంగా ఖర్చవుతుందట.
దుష్ప్రరిణామాలు..
వేడెక్కుతున్న వాతావరణం వ్యవసాయోత్పత్తిని దెబ్బతీస్తుంది. చలి దేశాలలో ఒకటి నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి పెరిగితే పంట దిగుబడులు పెరుగుతాయని అంచనా. కానీ, మనలాంటి ఉష్ణ ప్రాంతాల్లో 1-2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినా ప్రధాన ఆహారపంటల (వరి, గోధుమ) దిగుబడి తగ్గిపోతుంది. 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే అన్ని దేశాల్లో వ్యవసాయోత్పత్తి తగ్గుతుందట. ఈ దుష్ప్రరిణామాలు పేద దేశాల ప్రజలపై తీవ్రంగా ఉంటాయి. ఈ దేశాలలో కూడా పేదలే ఇంకా తీవ్రంగా నష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని భరించే శక్తి కూడా వారికి తక్కువ. కానీ, ధనిక దేశాలు తమ అంగ, అర్ధ బలాలతో తమ భారాల్ని అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఏదో రూపంలో నెడ్తున్నాయి. ఇప్పటి వాతావరణమార్పుల ధోరణి ఇలాగే కొనసాగితే మన ప్రధాన నదులైన గంగా, సింధూ, బ్రహ్మపుత్ర 2030 నాటికి పూర్తిగా అంతరించిపోతాయట!
వాతావరణంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్ని ఇప్పటికే మనం అనుభవి స్తున్నాం. వ్యవసాయోత్పత్తిపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. 2020 నాటికి మన దేశంలో 7.5 నుండి 25 కోట్ల మంది ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందట!
పెరుగుతున్న భూగోళ ఉష్ణోగ్రతలు సముద్రపు నీటిమట్టాలను పెంచుతాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ధృవప్రాంతాల్లో మంచును కరిగిస్తాయి. దీంతో సముద్ర మట్టాలు పెరుగుతాయి. 1993 నుండి ప్రతి ఏడాది సముద్ర మట్టం 3 మి.లీ. పెరుగుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. భూగోళ వాతావరణ ఉష్ణోగ్రత 3-4 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే 33 కోట్ల ప్రజలు తాత్కాలికంగా లేక శాశ్వతంగా వరద పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తుందట. ఇది తుపానులు తరచుగా రావడానికి కూడా దోహదపడుతుంది.
మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్ర ప్రజలు పెరుగుతున్న సముద్రమట్టం దుష్ఫలితాలను ఎదుర్కొంటారు. అదేవిధంగా, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, తదితర రాష్ట్రాల ప్రజలు తుపాను ప్రమాదాల్ని మరింతగా ఎదుర్కోవాల్సి వస్తుంది.
మన జీవవైవిధ్యం ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో దెబ్బతింటుంది. గంగా, సింధూ మైదానంలో వ్యవసాయోత్పత్తి దెబ్బతింటుంది. మన ఆరోగ్యాల మీద కూడా దీని దుష్ప్రభావాలు ఉంటాయి.
ఏంచేయాలి?
ఈ సందర్భంగా పర్యావరణం ప్రాధాన్యతను తెలియజేయడానికి కార్యక్రమాల్ని చేపట్టాలి. మన చుట్టూ ఉన్న వారికి పర్యావరణ ప్రాధాన్యత గురించి చైతన్యం కలిగించాలి. ప్రధానంగా వాతావరణంలో వచ్చే మార్పుల్ని విడమరిచి చెప్పాలి. హరిత సాంకేతిక అంశాలను చెప్పి, వారిచే ఆచరింపజేయాలి. ఈ సంవత్సర ధరిత్రీ దినోత్స వంలో భాగంగా 'సుస్థిర భవిష్యత్తు' అనే ప్రధానాంశంతో విశ్వమానవాళిని సమీ కరిస్తున్నారు. భూగోళాన్ని పరిరక్షించే బాధ్యతలో భాగస్వామ్యం కావాలనే కాంక్షను ప్రతి ఒక్కరిలో కలిగించాలి. ఇందుకు చెట్లను నాటించాలి. వ్యర్థాల్ని తగ్గించాలి. పునర్వి నియోగించగల వస్తువుల్నే వాడాలి. రసాయనాలకు బదులుగా సేంద్రీయ ఉత్పత్తులనే వాడాలి. విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించాలి. 'ఫ్లోర్‌సెంట్ బల్బుల్ని' వాడాలి. చేతి సంచుల్ని పునరుద్ధరించాలి. కాలుష్యాన్ని నివారించాలి. పునరుపయోగించగల ఇంధనం (శక్తి) అందరికీ అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాలి. దీనికోసం బడ్జెట్ పెంచేందుకు కృషి చేయాలి. ఇంధన వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ అది అవసరం మేర అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి.
ఎవరు బాధ్యులు?
ప్రపంచంలో విడుదలయ్యే మొత్తం గ్రీన్‌హౌస్ వాయువుల్లో (1985-2008 మధ్య కాలం) అగ్రస్థానంలో ఉన్న పది దేశాల భాగస్వామ్యం ఇలా ఉంది (శాతంలో): అమెరికా-28.5; చైనా-9.3; రష్యా-7.95; జర్మనీ-6.78; బ్రిటన్-5.73; జపాన్-3.88; ఫ్రాన్స్-2.73; భారత్-2.52; కెనడా-2.17; ఉక్రెయిన్-2.33.
2009లో ఈ వాయువుల తలసరి వార్షిక విడుదల (టన్నుల్లో) ఇలా (శాతంలో) ఉంది: అమెరికా-16.9; రష్యా-10.8; ద.కొరియా-10.6; జర్మనీ-9.2; జపాన్-8.6; చైనా-5.13; బ్రిటన్-7.5; భారత్-1.37.
వినియోగించే ఇంధనం ఆధారంగా కాక, ఉపయోగిస్తున్న వస్తువుల తయారీలో విడుదలయ్యే గ్రీన్‌హౌస్ వాయువుల మొత్తాల్ని ఆధారంగా తీసుకుంటే 2004లో లక్సెంబర్గ్ సగటు విడుదల అత్యధికంగా 34.7 టన్నులుగా ఉంది. అమెరికాలో-22.0; సింగపూర్‌లో-20.2; ఆస్ట్రేలియాలో-16.7; కెనడాలో-16.6 టన్నులుగా ఉంది.
మన దేశంలో అనుసంధాన కార్యక్రమాలు..
మన దేశంలో 40వ వార్షికోత్సవం (2010) నుండి ధరిత్రీ దినోత్సవ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టబడ్డాయి. 2011లో 170 పట్టణాల్లో 29 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. వేలాదిమంది ప్రజలు పాల్గొని, కార్బన్ వాయువుల విడుదలను తగ్గిస్తూ సుస్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి దీక్షాబద్ధులయ్యారు. తద్వారా ప్రపంచ పర్యావరణ ఉద్యమంలో భారతీయులు కూడా భాగస్వాములు కావడానికి వీలైంది. 2012లో దాదాపు 10 లక్షల మందిని కదిలించడానికి కార్యక్రమాలు రూపొందాయి. దీనిలో చెట్లు నాటడం, హరిత సాంకేతికాల వినియోగాన్ని ప్రచారం చేయడం, సామూహిక కార్యక్రమాలు నిర్వహించడం అనేవి ప్రధానంగా తీసుకున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని, వారిద్వారా విద్యార్థుల్ని భవిష్యత్తరాల ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. మహిళలకు హరిత సాంకేతిక విజ్ఞానం, ఆర్థిక అంశాలపై అవగాహన కలిగించే కృషి ఈ సంవత్సరం కొనసాగనుంది.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య Wed, 11 Apr 2012, IST

భూమి ఎలా పుట్టింది? అంతకన్నా ముందు ఈ విశ్వం ఎలా పుట్టింది? ఈ విషయాలను సంక్షిప్తంగా తెలియజేయగలరని మనవి.
- ఓ ఔత్సాహిక జనవిజ్ఞాన వేదిక నాయకుడు, హైదరాబాద్
తన తల్లిదండ్రులెవరో తెలీనివ్యక్తికి వారి గురించి తెలుసు కోవాలన్న ఉద్వేగభరితమైన కుతూహలం ఎలాగో మన విశ్వం గురించిన ఆసక్తీ మనందరికీ అలాగే ఉండటం సహజమే!
విశ్వావిర్భావం గురించి పలు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నా శాస్త్రీయ నిర్ధారణకు అనుకూలమైన సిద్ధాంతం 'హరాత్మక విశ్వ నమూనా (Model of Oscillating Universe)'. ఆ తర్వాత చెప్పకోదగింది 'మహా విస్ఫోటన సిద్ధాంతం (Big Bang Theory)', 'నిశ్చల గమనస్థితి నమూనా సిద్ధాంతం (Steady State Theory)' కూడా ప్రచారంలో ఉంది. ఈ మూడు సిద్ధాంతాల్లో అటూయిటూగా శాస్త్రీయత ఇమిడి ఉంది. అయితే హరాత్మక చలన సిద్ధాంతానికి ఎక్కువ అవకాశం, సైద్ధాంతిక పునాది ఉన్నాయి. ఎందుకంటే ఈ నమూనా ద్వారా మిగిలిన రెండు నమూనాలను కూడా అంతర్లీనమైనవిగా చూప గలం. అయితే అత్యంత అశాస్త్రీయమైందీ, పాలకవర్గాలకు, ఛాందసులకు బాగా నచ్చిందీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల స్థాయిలో బోధించబడుతున్న సిద్ధాంతం ఒకటి ఉంది. దాదాపు అన్ని మతాల్లోనూ సర్వసాధారణంగా ఉండేది, వాదించేది దీన్నే. దీనిపేరు 'విజ్ఞ నిర్మిత సిద్ధాంతం (Intelli-gent Design Theory)'. ఎవరో ఓ సృష్టికర్త (Creator) ఈ విశ్వాన్ని తన తెలివితేటలతో రూపొందించాడని ఈ సిద్ధాంతం చెబుతుంది. 'ఆ తెలివితేటలున్న వ్యక్తి లేదా శక్తిని ఎవరు సృష్టించారు' అన్న ప్రశ్నను ఈ సిద్ధాంతం దాట వేస్తుంది. ఇది పురాణగ్రంథాలకు అనుకూలంగా ఉండడంతో మతవాదు లు ఎక్కువమంది దీన్ని సమర్థిస్తారు. కానీ ఈ సిద్ధాంతానికి ఆవ గింజంతా ఆధారాలు లేవు. నమ్మకం, విశ్వాసం తప్ప శాస్త్రీయ ఆధారాలు ఏమీలేని ఈ సిద్ధాంతాన్ని పక్కన పెడదాం.
నిశ్చలస్థితి గమన సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వాన్ని ఈ రూపంలో ఉంచేందుకు కొన్ని పదార్థాలు మారుతూ ప్రయత్నిస్తుండగా విశ్వం లో మరికొంత భాగం మరో రూపం లోకి మారుతూ ప్రస్తుత విశ్వాన్ని నిలకడ (steady state) గా ఉంచుతున్నాయి. ఉదాహరణకు సముద్రంలో నీరు ఎప్పుడూ ఆవిరవుతూ మేఘాలుగా మారి, వర్షిస్తూ నదుల్ని నీటితో నింపి నదీ ప్రవాహానికి అవకాశమిస్తోంది. ఆ నదిలో పారే నీరు చివరికి సముద్రంలో కలుస్తోంది. ఈ చక్రీయ చలనాన్ని అవిచ్ఛన్నంగా ఊహించండి. ఇపుడు ఆ నదినే మనం చూస్తున్న విశ్వంగా భావించాలి. నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. నేటి నీరు, ఓ గంట కింద నీరు ఒకటే కాదు. కానీ నేటి నీటి గమన విధానం ఓ గంట కిందటి నీటి గమన విధానం ఒకటే. ఈ నీటికి ఆధా రంగా మేఘాలు వర్షిస్తున్నాయి. ఈ మేఘాల్ని సముద్రంలోని నీరు సూర్యశక్తితో సమకూరుస్తోంది. అయితే ఇలా చక్రీయంగా కాకుండా కదులుతున్న చక్రం(Spiral) గానో లేదా నడుస్తున్న బండిచక్రంగానో విశ్వాన్ని భావించాలిగానీ నిలకడగా ఒకేచోట చక్రీయంగా కుమ్మరి సారి చక్రంలాగానో, పంటపొలాల్లో ఊట బావి మోటారు చక్రంగానో భావించకూడదన్నది ఈ సిద్ధాంత సారం. విశ్వంలో ప్రస్ఫుటంగా ఉన్న కొన్ని సార్వత్రిక నియమాల (Laws of Universe) కు ఇది విరుద్ధంగాలేదు. ఉదాహర ణకు విశ్వంలో శక్తి, ద్రవ్యరాశి కలగలిపి స్థిరంగా (Law of Conservation of Mass and Energy) ఉన్నాయి అన్న సిద్ధాంతాన్ని ఇది ఉల్లంఘించదు. 'ఈ విశ్వంలో మారనిది అంటూ ఏదీలేదు (Everything in the Universe Changes)' అన్న మరో నియమాన్ని కూడా ఇది వ్యతిరేకిం చదు. 'ఈ విశ్వం వ్యాకోచిస్తోంది (Universe is Expand-ing)' అన్న మరో వాస్తవాన్ని ఇది కాదనదు. పెరిగే వర్తులాకార చక్రంలాగా ఈ విశ్వ నిశ్చలస్థితి గమనం ఉందని ఇది ఒప్పు కుంటుంది. 'శంఖాకారంలో ఉన్న నత్తగుల్లలో ఓ మధ్యభాగంలో మనం ఉన్నామనుకుంటే దానికి కింద ఉన్న (పూర్వపు) వర్తుల పరిధి(spiral perimeter) నేటి వర్తుల పరిధి కన్నా తక్కువ ఉంటుంది. దానికి పైనున్న (రేపటి) వర్తుల పరిధి మరింత విస్తా రంగా ఉంటుంది. అలాగన్నమాట. ఇలా చక్రీయ వర్తుల గమ నంలో, నిశ్చలస్థితి గమనంలో ఉన్న వ్యవస్థలో ఎంట్రోపీ(entropy) లేదా క్రమరాహిత్యం (disorder) క్రమేపీ పెరుగుతుందనేది మరో ప్రకృతి సూత్రం. దానిని కూడా ఈ విశ్వ సిద్ధాంతం ఆక్షేపణ చేయదు. అయితే ఈ సిద్ధాంతానికి పరాకాష్ట ఏమిటంటే ఎప్పుడోకప్పుడు ఈ విశ్వంలో ఏమీలేని స్థితి ఉండేదని పిస్తుంది. ఆ విధమైన అగమ్య స్థితికి తోడుగా నేటి వాస్తవ విశ్వ రూపానికి వయసెంతో చెప్పలేని పరిస్థితీ ఈ సిద్ధాంతంలో ఉన్న ఓ పరిమితి. అందువల్ల దీన్ని అంతగా స్వీకరించలేదు.
ఇక మహా విస్ఫోటన సిద్ధాంతం గురించి. సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో కేవలం శక్తి మాత్రమే ఉండేదని, ద్రవ్యరాశి రూపంలో ఉండే పదార్థమేదీ లేదని ఈ సిద్ధాంతం చెబుతుంది. శక్తికి స్థలమవసరం లేదు కాబట్టి అపుడు విశ్వంలో పొడవు, వెడల్పు, ఎత్తు అని కొలవగలిగే ప్రాంతమేదీ లేని శూన్య ప్రదేశం (zero space) ఉండేదని ఈ సిద్ధాంతం ప్రస్తావిస్తుంది. పదార్థాలలో కలిగే మార్పుల అంతరమే కాలం కాబట్టి పదార్థమే లేని ఆ శూన్యస్థితిలో కాలం కూడా శూన్యమే (zero time). ఒక్క ఫళాన ఆ శక్తి పదార్థంగా అవతరించిందని ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. శక్తి పదార్థంగా మారిన ఆ సంఘటననే మహా విస్ఫోటనం అంటున్నారు. ఆ విస్ఫోటనంలో ఏర్పడిన పదార్థం నెబ్యులా అనబడే మేఘాల ముక్కలుగా మొదట ఏర్పడి ఆ తర్వాత క్రమేపీ కణాలు (particles) గా మారిందంటారు. ఆ సందర్భంగా విడుదలైన కాంతిశక్తి విశ్వం మొత్తం సమానంగా వ్యాపించిందని, దాని ఆనవాళ్లు నేటికీ K- రేడియేషన్ పేరుతో ఉన్నట్టు పెంజియాస్, విల్సన్ అనే ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలు ఋజువు చేశారు. వారిద్దరికీ 1978 సంవత్సరపు భౌతికశాస్త్ర నోబెల్ బహుమతిని కూడా బహూకరించారు. మరి విజ్ఞ నిర్మిత సిద్ధాంతాన్ని అదే పనిగా పట్టుకుని వేళ్లాడితే ప్రజలు నమ్మరన్న నమ్మకంతో ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం మతవాదనకు (అంతకుముందు ఏమీలేనట్టు, ఒక్కసారిగా ఉన్నఫళాన దభీమని విశ్వం పుట్టినట్టు) అంతో యింతో దగ్గరగా ఉన్నట్టు అనిపించడం వల్ల ఎక్కువమంది మతవాద శాస్త్రవేత్తలు, శాస్త్రం పేరుతో మతాన్ని బలపర్చే వారికి 'మహా విస్ఫోటన సిద్ధాంతం' మహా విజయ వంతమైన సిద్ధాంతంగా స్ఫురిస్తోంది. కానీ శక్తి ఎపుడూ పదార్థానికి అవతల ఉండదని ఆధునిక క్వాంటం సిద్ధాంతం ఋజువు చేసింది. పదార్థంలో శక్తి (wave), కణతత్వం(particle) జంటగా ఒకే నాణేనికి రెండు పార్శ్వాలుగా ఉంటా యన్నది దాని వాదన. ఓ వైపు అన్ని వాదాలలో ఉన్న ఋజువుల్ని ఆమోదిస్తూనే తార్కికతకు నిలిచేలా విశ్వ పరిణామాన్ని విశదీకరించే సిద్ధాంతం హరాత్మక చలన సిద్ధాంతం. ఆ వివరాలు పై వారం తెలుసుకుందాం.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
_______________________________________________________________________
భూగోళం వేడెక్కడాన్ని నివారించలేమా?
'మీ భూగోళానికి మీరు కావాలి! వాతావరణ మార్పులను సమైక్యంగా ఎదుర్కొందాం!' అనే సందేశంతో ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ 38వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంలో (జూన్5-2009) పిలుపునిచ్చింది. దీనర్థం ప్రపంచ పర్యావరణాన్ని పరిరక్షించడానికి, భూగోళం వేడెక్కకుండా ఉంచడానికి ఏ ఒక్కరికీ సాధ్యంకాదని, ఇది సమస్త ప్రజలకు సంబంధించిందని, ఈ బృహత్ కార్యంలో అందరూ పాలుపంచుకొని భూగోళాన్ని రక్షించాలని ఈ సందేశం తెలుపుతుంది. ఈ సందేశం వాస్తవరూపం దాల్చాలంటే ప్రపంచదేశాలలోని ప్రజలందరూ వ్యక్తిగతంగా, సామూహికంగా వారి వారి ప్రభుత్వాల ద్వారా నిర్ణయాలు తీసుకొని భూగోళం వేడెక్కకుండా నివారించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
అసలు భూగోళం ఎందుకు వేడెక్కుతుంది అనేది పలుసందర్భాల్లో తెలుసుకున్నాం. భూమి వేడెక్కడానికి ప్రధానకారణం పెరుగుతున్న బొగ్గు, పెట్రోలియం పదార్ధాల వాడకం, అడవుల నరికివేత. దీని దుష్ప్రభావాలు అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాల రూపంలో చూస్తున్నాం. అడవుల నరికివేత, గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల ధనికుల జీవనశైలి వల్ల పెరుగుతుండగా, పేదలు వీని దుష్ప్రభావాలకు ప్రధానంగా గురవుతున్నారు.
భూగోళం వేడెక్కెడానికి ప్రధానకారణం వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్, ఫ్లోరో కార్బన్ వాయువులు. 18వ శతాబ్దంలో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం బొగ్గు, పెట్రోలియం పదార్థాల వాడకాన్ని బాగా పెంచాయి. ఇవి వేడిని, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, గంథకం కలిగిన వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. ఫలితంగా వాతావరణం వేడెక్కుతుంది. ఈ వాయువుల విడుదల వల్ల 20వ శతాబ్దంలో భూగోళ ఉపరితల ఉష్ణోగ్రత సరాసరి దాదాపు 0.75 + 0.18 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగింది. ఇదేవిధంగా 21వ శతాబ్దంలో వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వాలు తీసుకునే చర్యలను బట్టి ఉష్ణోగ్రత 1.1 నుండి 6.5 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ పెరగవచ్చని అంచనాలున్నాయి. ఇప్పటికే మన దేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 48-50 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల వరకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ పోతే మనలాంటి దేశాల ప్రజలు అసలు భూగోళం మీద బతికి బట్టకట్టగలరా? అనే ప్రశ్న తీవ్రంగా ముందుకు వస్తుంది. పెరుగుతున్న ఈ భూ ఉష్ణోగ్రతలు ధృవప్రాంతాల్లోనే మంచుగడ్డలను పెద్దఎత్తున కరిగిస్తున్నాయి. ఫలితంగా సముద్ర మట్టం పెరిగి తీరప్రాంతాలను ముంచుతుంది. మలావీ దేశం (ద్వీపకల్పం) దాదాపు మునిగిపోయే స్థితిలో ఉంది. అక్కడ ఐదులక్షల జనాభా నివసిస్తున్నారు. వీరిని ఎక్కడికి తరలించాలా అని ఆలోచిస్తున్నారు. సముద్ర నీటి మట్టం ఇలాగే పెరిగిపోతూ ఉంటే మన కొల్‌కతా లాంటి పట్టణాలు కూడా తీవ్ర ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల భూగోళం వేడెక్కకుండా నివారించాల్సిన అవసరం ఉంది.
సామూహిక చర్యలు
సామూహికంగా ప్రజలు తమ తమ ప్రభుత్వాలు బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తుల వాడకంపై నియంత్రణ వహిస్తూ, తిరిగి వాడగల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించే విధంగా ఒత్తిడి తీసుకోవాలి. ముఖ్యంగా పన్నుల ద్వారా, ఇతర ప్రోత్సాహకపద్ధతుల ద్వారా గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలపై పరిమితులు నియమించి, ఆచరించేలా అక్కడ పరిశ్రమలపై ఒత్తిడి తీసుకురావాలి. విద్యుదుత్పత్తి పరిశ్రమల నుండి విడుదలయ్యే కార్బన్‌డైఆక్సైడ్ వాతావరణంలోకి వెళ్లిపోకుండా సేకరించి, నిల్వ చేయాలి. ఈ వాయువును ఇతర పారిశ్రామిక అవసరాలకు వాడవచ్చు. దీనికై ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలను అమలు చేయించాలి. జలవిద్యుత్, పవన విద్యుత్, సౌరశక్తి వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వచర్యలు ఉండాలి. ఇంధన వినియోగాన్ని తగ్గించి, గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు సమిష్టి, నిరాడంబర జీవనశైలిని ప్రజల్లో ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. వ్యవసాయ, ఇతర వ్యర్థపదార్థాలతో తయారయ్యే ద్వితీయశ్రేణి జీవ ఇంధనాల ఉత్పత్తి, వాడక కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు ఉండాలి.
వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన చర్యలు
సమిష్టి ప్రయోజనం కోసం సమిష్టి సమాలోచన, వ్యక్తిగత కార్యక్రమాలు కూడా అవసరం.
భూగోళం వేడిని నియంత్రించే లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి మనిషి ఒక చెట్టును నాటాలని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటితే సంవత్సరంలోనే దాదాపు ఏడు బిలియన్ చెట్లు నాటినట్లు అవుతుంది. ఇవి పెరిగి, పెద్దవుతూ భూగోళ వేడిని తగ్గిస్తాయి.
నిత్యజీవితం పొదుపుగా, నిరాడంబరంగా ఉండే జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ఇంధనాన్ని ఆదా చేసే చర్యలే. ఇవి ఖర్చును కూడా తగ్గించే పొదుపు చర్యలే.
మనకు అవసరం లేని, ఇతరులకు అవసరం గల ఎన్నో వస్తువులు మనవద్ద ఉంటాయి. ఇటువంటి వస్తువులను వృధాగా పారేయకుండా అవసరం ఉన్న వారికి నేరుగా గానీ, లేదా సేవా సంస్థల ద్వారా గానీ అందించాలి.
ఇంటివద్ద నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. వృధా చేయకూడదు. ఇంధనాన్ని ఆదా చేసేందుకు వేడినీటి కుళాయిల నుండి వేడి నష్టపోకుండా రక్షణకవచాన్ని ఏర్పాటుచేయాలి.
వాడి పడేసే వస్తువులకు బదులు (యూజ్ అండ్ త్రో) పలుమార్లు వాడుకోగలిగిన వస్తువులనే ఉపయోగించాలి.
పురుషులు వాడి పడేసే రేజర్లకు బదులు బ్లేడ్లను మార్చి వాడగల రేజర్లను మాత్రమే ఉపయోగించాలి. ఇదేవిధంగా పేపర్ టవల్స్‌కు బదులుగా గుడ్డతో చేసిన టవల్స్‌ను వాడాలి. ఉతికి తిరిగి వాడుకోవాలి.
ఇప్పుడు పలుపేపర్లు కొనేవాళ్లు పక్కవారితో పంచుకొని కొనేపేపర్ల సంఖ్యను తగ్గించాలి. వీలున్నచోటల్లా లైబ్రరీలో చదవడాన్ని అలవాటు చేసుకోవాలి.
అన్నమూ, ఇతర ఆహారపదార్థాలను తీసికెళ్లేటప్పుడు వాడి పారేసే డబ్బాలకు బదులు తిరిగి కడిగి వాడుకోగల స్టీలు ఇతర బాక్సులను వాడుకోవాలి.
ఇల్లు విడిచి వెళ్లే ముందు అన్ని స్విచ్‌లను ఆపేయాలి. ముఖ్యంగా ఛార్జి పెట్టే ప్లగ్గులను ఛార్జి చేయనప్పుడు తీసివేయాలి.
షాపుకు వెళ్లే ముందు ఏదైనా సంచిని తీసికెళ్లాలి. ప్లాస్టిక బ్యాగ్‌లను వాడకూడదు.
ప్రయాణానికి సాధ్యమైనంతవరకు పబ్లిక ట్రాన్స్‌పోర్టును వాడాలి. ముఖ్యంగా అతి తక్కువ శక్తితో రైళ్లు ప్రయాణీకులను చేరుస్తాయి. కార్లు వాడేవారు తోటివారితో పంచుకోవాలి. వీలున్నప్పుడల్లా దగ్గర దూరాలకు సైకిల్ మీద ప్రయాణం చేయవచ్చు. లేదా నడవవచ్చు. ప్రభుత్వం కూడా పబ్లిక ట్రాన్స్‌పోర్టు చౌకగా, సమర్ధవంతంగా, తరచుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
ట్రాఫిక జామ్‌ల్లో ఇంజన్‌ను ఆపేయాలి.
వాహనాలను నడిపేటప్పుడు ఇంధన సామర్థ్యం అత్యధికంగా ఉండేలా నడపాలి.
ఆఫీసుల్లో, ఇతరత్రా పేపర్‌ను రెండువైపులా వాడాలి. పొదుపుగా వాడాలి. చిన్న చిన్న మెసేజ్‌లు పంపడానికి, లేదా చిత్తు పనికి అవసరంలేని ఒకవైపు వాడిన పేపర్లను ఉపయోగించుకోవాలి.
ఇంధనాన్ని పొదుపుగా వాడే పరికరాలనే వాడాలి. ఉదాహరణకు మామూలు బల్బులకు బదులు విద్యుత్‌ను పొదుపు చేసే సిఎఫ్ బల్బులను వాడవచ్చు. వీని ధర తగ్గేలా ప్రభుత్వం వీటి ఉత్పత్తిని ప్రోత్సహించాలి.
ఇంటివద్ద ఎయిర్ కండిషన్లు వాడితే, ఫ్యాన్లతో కలిపి కనీస సమయంలోనే ఎయిర్ కండిషన్లు వాడాలి.
వండేటప్పుడు ఇంధనం పొదుపయ్యేలా వండే పాత్ర, పొయ్యి అనుగుణంగా ఉండాలి.
లపర్యావరణాన్ని పరిరక్షించే ఉత్పత్తులనే వాడాలి.
- విజ్ఞానవీచిక డెస్క్
_____________________________________________________________
అరుదైన లోహాలు ... అసాధారణ ప్రయోజనాలు ...
Shareవిజ్ఞాన వీచిక డెస్క్ Wed, 5 Oct 2011, IST

బంగారం, ప్లాటినం లోహాలకన్నా అతి ఖరీదైన, అసాధారణ ప్రయోజనకరమైనవి అరుదైన లోహాలు. సాంకేతికపరంగా వీటిని 'రేర్ ఎర్త్ మెటల్స్ (విరళ మృతిక లోహాలు) గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో ఇవి వార్షికంగా దాదాపు లక్ష టన్నులు వినియోగమవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లు, రాకెట్, అంతరిక్ష సాంకేతికాల్లో, రక్షణ రంగంలో ఇవి ఎనలేని పాత్రను కలిగి ఉన్నాయి. ఇటువంటి కీలక లోహాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే 97 శాతంతో చైనా అగ్రస్థానంలో ఉంది. కానీ, ఈ దేశంలో గుర్తించినవి ప్రపంచ నిల్వల్లో మూడోవంతు మాత్రమే. అంతర్జాతీయంగా వచ్చిన, వస్తున్న మార్పుల నేపథ్యంలో మన దేశంలో 2004లోనే ఆపివేసిన వీటి ఉత్పత్తిని పునరుద్ధరించడానికి కృషి ప్రారంభమైంది. ఈ లోహాలకి సంబంధించిన విజ్ఞానాన్ని, ప్రయోజనాలను సంక్షిప్తంగా వివరిస్తూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.
'రేర్ ఎర్త్ మెటల్స్'.. ఇవి అంతగా దొరకవని, అరుదుగా దొరుకుతా యనే అర్థం ఈ పదంలోనే ఉంది. 17 లోహాలు ఈ అరుదైన లోహాల తరగతి లోకి వస్తాయి. స్కాండియమ్, ఎట్రియమ్ లోహాలతోబాటు లాంతనాయిడ్స్‌గా పిలువబడే 15 లోహాలు అరుదైన లోహాలుగా భావించబడుతున్నాయి. వాస్తవ మేమంటే ఈ అరుదైన లోహాలు ఇనుము, అల్యూమినియం, రాగి తదితర లోహాల్లాగా కొన్ని ఖనిజాల్లో కేంద్రీకరింపబడి ఉండకుండా సూక్ష్మ మొత్తాల్లో భూగోళం పైపొరల్లోని ఇతర పదార్థాలతో కలిసి (ఇంప్యూరిటీస్‌గా) ఉంటు న్నాయి. అయితే, సీరియం అనే అరుదైన లోహం భూగోళ రసాయనిక నిర్మాణంలో 68 పిపిఎంతో 25వ స్థానంలో ఉంది.
ఇది ఇంచుమించు రాగి పరిమాణంతో సమానం. అయితే, చాకోసైట్, కోవెలైట్, మాలకైట్ వంటి ఖనిజాల్లో రాగి పెద్ద పరిమాణంలో ఉంటూ, పారిశ్రామిక ఉత్పత్తికి అనువుగా ఉంటుంది. దీనితో పోల్చినప్పుడు అరుదైన లోహాల తయారీ ఇలా సాధ్యం కాదు. దీనికి కారణం భూమి పొరల్లో ఇవి సూక్ష్మరూపంలో విస్తరించి (ఫైన్లీ డిస్ట్రిబ్యూటెడ్) ఉంటాయి. వీటిని రసాయనిక చర్యలతో వేరుచేసి, ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది పర్యావరణ సమస్యలతో, చాలా ఖర్చుతో కూడుకు న్నది. వీటి తయారీలో 'అయాన్ మార్పిడి పద్ధతి' సాంకేతికం రూపొందిన తర్వాత పెద్ద పరిమాణంలో వీటి పారిశ్రామిక ఉత్పత్తి సులువైంది. దీనిలో చైనా అగ్రస్థానంలో ఉంటూ ప్రపంచ వినియోగంలో 97 శాతాన్ని అందించే స్థితిలో కొనసాగుతుంది.
ఇప్పుడు వీటి తయారీపద్ధతి సులవైనప్పటికీ ఈ లోహాలకు పాతపేరైన 'రేర్ ఎర్త్ మెటల్స్ (అరుదైన లోహాలు)' అనే కొనసాగుతుంది. అభివృద్ధి చెందిన దేశాల (అమెరికా, జపాన్, యూరప్, కెనడా) లో వీటికి గిరాకీ ఎక్కువ. అమెరికా వంటి దేశాల్లో వాణిజ్యపరంగా తయారుచేయగల అరుదైన లోహాల వనరున్నా, వీటి తయారీ పర్యావరణ సమస్యలతో కూడుకున్నది. తయారీ ఖర్చూ అధికం. అందువల్ల, వీటిని ఈ దేశాలు తయారుచేయడం లేదు. కేవలం దిగుమతుల మీదే ఆధారపడు తున్నాయి. ఈ అరుదైన లోహాలు పౌర వినియోగానికే కాక, రక్షణ సాంకేతిక పరికరాల్లో కూడా ఉపయోగపడుతున్నాయి. అణు వినియోగాల్లోనూ ఉపయోగపడుతున్నాయి.

పర్యావరణాన్ని రక్షించుకునేందుకు, సొంత వనరులను పరిరక్షించేందుకు వీటి ఉత్పత్తిని పరిమితం చేయాల్సిన అవసరం వచ్చిందని ప్రకటించిన చైనా తమ ఎగుమతులను బాగా తగ్గించింది. జపాన్‌తో సరిహద్దు తగాదా వచ్చిన తర్వాత ఈ తగ్గింపు ప్రారంభమైంది. ఈ తగ్గింపుకూ జపాన్‌తో వివాదానికీ ఏ సంబంధమూ లేదని చైనా ప్రకటించింది.
అధిక ఉష్ణోగ్రతలో ఇవి స్థిరంగా ఉంటాయి. అందువల్ల ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వీటిని వాడుతున్నారు. మామూలు లోహాలతో పోలిస్తే ఇవి అతి కొద్ది మోతాదులో సరిపోతాయి. వీటి వినియోగ సామర్థ్యం చాలా ఎక్కువ.
స్కాండియం, యెట్రియం, లాంతానమ్, సీలియమ్, ప్రెస్సోడిమియం, నియోడిమియం, ప్రోమిథియం, సమారియం, యూరేపియం, గాడోలీనియం, టెర్బియం, డిస్ప్రోజియం, హౌల్మియం, థూలియం, ఎటర్బియం, లొటేటియం. ఇవన్నీ వేర్వేరు ఖనిజాల్లో కాకుండా మోనాజైట్ అనే ఖనిజంలో మిశ్రమంగా ఉంటూ, పారిశ్రామిక ఉత్పత్తికి వీలు కల్పిస్తున్నాయి.
ప్రోమిథియం లోహం రేడియోథార్మిక శక్తి కలిగి ఉంది. ఇది దీర్ఘకాల స్థిరత్వంతో ఉండదు. యురేనియం 238 విచ్ఛిన్నమైనప్పుడు ఇది కొద్ది మోతాదులో విడుదలవుతుంది. కానీ, దీనిని న్యూక్లియర్ రియాక్టర్లలో తయారుచేస్తారు.
ఈ అరుదైన లోహాలు ఇనుము కన్నా బరువుగా ఉంటాయి. వెండిలాగా తెల్లగా లేదా బూడిదరంగులో ఉంటాయి. ఇవి ప్రకాశించే శక్తిని (షైనింగ్) కలిగి ఉంటాయి. కానీ ఈ శక్తి గాలిలో వేగంగా క్షీణిస్తుంది. ఇవి అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా మంచి విద్యుత్‌వాహకాలు (విద్యుత్ ప్రసారం) గా పనిచేస్తాయి. వీటి ఎన్నో గుణగణాలు ఒకే విధంగా ఉంటాయి. అందువల్ల ఒకదాన్నుంచి మరొక దానిని గుర్తించడం, వేరు చేయడం చాలా కష్టం. ఇవి ప్రకృతిలో కలిసి (ఫాస్ఫేట్ రూపంలో మోనజైట్ ఖనిజంగా) ఉంటాయి. సామాన్యంగా అలోహాలతో కలిసి ఆక్సైడ్ రూపంలో ఉంటాయి.
స్కాండియం: అల్యూమినియంతో లోహమిశ్రమంగా విమాన, అంతరిక్ష పరికరాల తయారీలోనూ, మెర్క్యూరీ వేపర్‌ల్యాంప్ (ట్యూబ్‌లైట్)లలో మిశ్రమ లోహంగా వాడుతున్నారు.
యెట్రియం : టీవీల తయారీలో ఎరుపురంగునిచ్చే ఫాస్ఫర్ పదార్థంగా, అధిక ఉష్ణోగ్రత వద్ద విద్యుత్‌వాహకం (సూపర్ కండక్టర్)గా ఉపయోగిస్తారు. మైక్రో ఫిల్టర్ తయారీలోను వాడుతున్నారు.
లాంతానం : ప్రత్యేకమైన గ్లాసు తయారీలో, బ్యాటరీ ఎలక్ట్రోడ్స్‌గా, కెమెరా లెన్స్, తదితరాల్లో వాడుతున్నారు.
సీలియం: ఆక్సీకరణలో, గాజు, పింగాణీ పాత్రల్లో పసుపురంగు కోసం, ఆయిల్ రిఫైనరీల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు.
ప్రెస్సోడిమియం, నియోడిమియంలు : ప్రత్యేక అయస్కాంతాల తయారీల్లో, లేజర్ కిరణాల సృష్టిలో, గ్లాసుల్లో-పింగాణీల్లో రంగులను సృష్టించడా నికి, వెల్డింగ్ గ్లాసుల తయారీ తదితరాల్లో ఉపయోగిస్తున్నారు.
ప్రోమిథియం: న్యూక్లియర్ బ్యాటరీల్లో వాడుతున్నారు.
సమారియం: ప్రత్యేక అయస్కాంతాలు, లేజర్ కిరణాల్లో, న్యూట్రాన్ క్యాప్చర్‌కు (రేడియో థార్మిక వినియోగంలో) వాడుతున్నారు.
యూరేపియం: ఎరుపు, నీలం రంగు ఫాస్ఫర్స్ తయారీలో, లేజర్ కిరణాల్లో, మెర్క్యురీ వేపర్ ల్యాంప్స్, ప్రత్యేక వైద్య పరికరాల తయారీలో దీన్ని వాడుతున్నారు.
గాడోలీనియం: ప్రత్యేక గ్లాసులు, లేజర్ కిరణాల, ఎక్స్-రే ట్యూబ్‌లు, కంప్యూటర్ మెమోరీచిప్స్‌లో, న్యూట్రాన్ క్యాప్చర్, ప్రత్యేక వైద్య పరికరాలు, తదితరాల తయారీలో ఉపయోగిస్తున్నారు.
టెర్బియం: ఆకుపచ్చ ఫాస్ఫర్లు, లేజర్లు, ఫ్లోరిసెంట్ ల్యాంపుల తయారీల్లో వాడుతున్నారు.
డిస్ప్రోజియం: ప్రత్యేక అయస్కాంతాలు, లేజర్ కిరణాల తయారీల్లో ఉపయోగిస్తున్నారు.
హౌల్మియం: లేజర్ కిరణాల్లో వాడుతున్నారు.
థూలియం: పోర్టబుల్ ఎక్స్-రే మిషన్ తయారీలో ఉపయోగిస్తున్నారు.
ఎటర్బియం: ఇన్‌ఫ్రా రెడ్ (పరారుణ) లేజర్ కిరణాల్లో, రసాయనిక క్షయ కరణ పదార్థంగా వాడుతున్నారు.
లొటేటియం: స్కాన్ డిటెక్టర్‌ల తయారీలో ఉపయోగిస్తున్నారు.
_____________________________________________________________
నేటి రేబిస్...
Shareవిజ్ఞాన వీచిక డెస్క్

మనుషులు, పశువులపై రేబిస్ దుష్ప్రభావాల గురించి చైతన్యం కలిగించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన 'ప్రపంచ రేబిస్ దినం (వరల్డ్ రేబిస్ డే)' గా జరపాలని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' తదితర అంతర్జాతీయ సంస్థలు నిర్ణయించాయి. ఈ రోగాన్ని నియంత్రించగల వ్యాక్సిన్‌ను మొట్టమొదటిసారిగా రూపొందించిన 'లూయీ పాశ్చర్' మరణించిన రోజును 'ప్రపంచ రేబిస్ దినం'గా పాటిస్తున్నారు. రేబిస్ వల్ల నేడు ప్రపంచంలో ప్రతి సంవత్సరం దాదాపు 55 వేల మంది చనిపోతున్నారని ఒక అంచనా. ఇలా చనిపోతున్నవారిలో 30%-36% భారతీయులే. దీనికి ప్రధానకారణం మనదేశంలో వీధికుక్కల సంఖ్య అధికంగా ఉండటమే. చనిపోతున్న వారిలో పేదలే అత్యధికం. ఇదెంతో ఆందోళన కలిగించే అంశం. అందువల్ల, రేబిస్ నివారణకు మనదేశంలో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలుచేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ అందుబాటులో లేక ఈ ఏడాది మన రాష్ట్రంలో వరుసగా రేబిస్‌తో కొనసాగుతున్న బాలల మరణాలు దీని ఆవశ్యకతను నొక్కి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రేబిస్‌కు సంబంధించిన విజ్ఞానాన్ని, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సంక్షిప్తంగా తెలుపుతూ.. మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
రేబిస్ అనేది ఒకరకం వైరస్ వల్ల వచ్చే రోగం. 'రాబ్డో విరిడే' కుటుంబానికి చెందిన 'లిస్సా వైరస్' వల్ల ఈ రోగం సాధారణంగా వస్తుంది. లాటిన్ భాషలో 'రేబిస్' అంటే 'మాడ్నెస్ (పిచ్చి)'. సంస్కృతంలో 'రాబాస్' అంటే హింసను ప్రేరేపించడం. గ్రీకులో దీనిని 'లిస్సా' అంటారు. ఇది 'లుడ్' అనే పదం నుండి వచ్చింది. అంటే 'హింస'. ఇది తీవ్ర మెదడువాపు జబ్బు. రక్తం వేడిగా ఉండే జీవుల్లో (మనుషులతో సహా) ఈ వైరస్ వల్ల మెదడు వాసి, జ్వరం వస్తుంది. ఈ వ్యాధి జంతువుల వల్ల వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో కుక్కకాటు వల్ల ఇది వ్యాపిస్తుంది. మనుషుల ద్వారా ఇది వ్యాపించదు.
ఈ జబ్బు లక్షణాలు ఒక్కసారి కనిపించిన తర్వాత చావు అనివార్యమవుతుంది. చికిత్స లేదు. అందువల్ల దీని లక్షణాలు కనపడకముందే నివారణ చర్యలు (వ్యాక్సిన్ ఇవ్వడం) ప్రారంభించాలి. వైవిధ్యభరితమైన పరిసరాల్లో రేబిస్ వైరస్ జీవించగలుగుతుంది. అన్ని జంతువుల్లో ఈ వైరస్ ఉండవచ్చు.

ఈ వైరస్ మెదడు కణాల్లో ప్రవేశించిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఒక్కసారి ఇది మెదడుకు చేరిన తర్వాత ఈ రోగ లక్షణాలు బయటపడతాయి. అంతిమంగా ఇవి చావుకు దారితీస్తాయి.
కుక్కకాటు వల్ల లేదా దాని నోటి నుండి ఊరే లాలాజలం ద్వారా రోగకారక వైరస్‌లు పైపైన ఉండే నరాల్లోని కణాల ద్వారా మెదడుకు చేరతాయి. ఇలా చేరడానికి రెండు వారాల నుండి రెండేళ్ల వరకూ పట్టవచ్చు. అందువల్ల కుక్క కరిచిన తర్వాత రేబిస్ ఈ కాలంలో ఎప్పుడైనా రావచ్చు. ఒక్కసారి ఈ వైరస్‌లు మెదడును చేరి, రోగ లక్షణాలు చూపడం ప్రారంభ మైన తర్వాత రోగం నయం కాదు. చికిత్స లేదు.. కొద్దిరోజుల్లో చనిపోతారు.
ప్రారంభదశలో ఈ వ్యాధి సోకినవారు ఇతరులను ద్వేషిస్తారు లేదా హాని కలగాలని కోరుతుంటారు. దీంతోపాటు వీరికి తలనొప్పి, జ్వరం (ఫ్లూలా) వస్తుంది. ఆ తర్వాత తీవ్ర నొప్పి, ఆవేశంతో కూడిన కదలికలు, నియంత్రించలేని ఉద్రేకం, మానసికంగా కుంచించుకుపోయే స్థితి ఉంటుంది. అలాగే నీటిని చూసి భయపడటం (హైడ్రో ఫోబిక్), నీటిని మింగలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతిమంగా, రోగ బాధితులు ఏదో పూనినట్లు, చురుకుదనం కోల్పోతూ, స్పృహ కోల్పోతారు. చివరకు వీరు శ్వాస అందక చనిపోతారు.
ప్రపంచంలో 97% మందికి రేబిస్ వ్యాధి కుక్కకాటు ద్వారా సోకుతుంది. అభివృద్ధి చెందిన ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ వ్యాధి టీకాల ద్వారా పూర్తిగా నియంత్రించబడింది. ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్‌లాంటి దేశాల్లో భూమి మీద నివసించే జంతువుల ద్వారా జరిగే రోగ వ్యాప్తి పూర్తిగా నియంత్రించబడింది. కానీ, ఈ దేశాల్లో గాలి, గబ్బిలాల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి కొనసాగుతుంది. కొన్ని దేశాల్లో ఈ వ్యాధితో ఎన్నో జంతువులు చనిపోతున్నాయి. ఆర్థికనష్టాల్నీ కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆసియా, ఆఫ్రికా దేశాల్లో జరిగే మరణాల్లో 95% కుక్కకాటు వల్లే సంభవిస్తున్నాయి. ఇలా కుక్కలు కరిచేవారిలో 30%-65% మంది 15 ఏళ్లలోపు బాలలే. బాలల తర్వాత పశువుల వద్ద పనిచేసే సిబ్బంది, పశు కాపరులు, అడవి జంతువులను నియంత్రించేవారు ఈ రోగ బారిన పడుతున్నారు.
బాల బాధితులే ఎక్కువెందుకు?
* చిన్నగా ఉండటం, కుక్కకు తేలికగా కనపడటం.
* సహజంగా జంతువుల పట్ల వీరికుండే ఆకర్షణ. ఆడుకోవాలనుకునే కోరిక.
* జంతువుల వల్ల చిన్న చిన్న గాట్లు వచ్చినా, చిన్నగా గీరుకున్నా పట్టించుకోకపోవడం. తల్లిదండ్రులకు చెప్పకపోవడం.
____________________________________________
వ్యాధి సోకిన కుక్కల్ని గుర్తించడం ఎలా?
Shareవిజ్ఞాన వీచిక డెస్క్ Wed, 16 Nov 2011, IST
* ఈ వ్యాధి సోకినప్పుడు మామూలు కన్నా ఉధృతంగా తిరగబడే స్వభావం, కొట్లాడే స్వభావం కలిగి ఉంటాయి.
* వాటి జోలికి పోకున్నా మీదపడే స్వభావం కలిగి ఉంటాయి.
* అసాధారణ ప్రవర్తనను కలిగి ఉంటాయి.
తక్షణం తీసుకోవాల్సిన చర్యలు..
కొద్దిగా గీరుకున్నా లేదా గాయమైనా వెంటనే చికిత్స ప్రారంభించాలి. మొదట సబ్బు నీటితో శుభ్రంగా గీరుకున్న / గాయమైన ప్రాంతాన్ని కడగాలి. ఆ తర్వాత యాంటిసెప్టిక్ క్రీమ్‌ను రాయాలి. రేబిస్ నిరోధక వ్యాక్సిన్‌ను ఇంజక్షన్ ద్వారా ఐదురోజుల కోర్సుగా ఇవ్వాలి. మొదటిరోజు, 3, 7, 14, 28వ రోజున ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజక్షన్ ప్రారంభించిన రోజును మొదటిరోజుగా లెక్కించాలిగానీ, గాయమైన రోజును మొదటి రోజుగా గుర్తించకూడదు.
గతంలో మాదిరి ఇపుడు బొడ్డు చుట్టూ బాధాకరంగా 11 ఇంజెక్షన్లు తీసుకోనవసరం లేదు. కేవలం ఐదు ఇంజెక్షన్లు తీసుకుంటే చాలు. అదీ మామూలు ఇంజెక్షన్ మాదిరి చేతి కండారాలకు తీసుకోవచ్చు.
వ్యాక్సిన్ ఇవ్వడంలో కొద్దిగా ఆలస్యమైనా రోగ లక్షణాలు కనపడకముందే ఇవ్వాలి.
మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక జబ్బులకు మందులు తీసుకుంటున్నవారు వాటిని ఆపకుండానే ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
కరిచిన కుక్కను గుర్తించినా / గుర్తించకపోయినా ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే.
ఎర ఆహారం ద్వారా అడవి జంతువుల్లో వ్యాక్సిన్‌తో రోగ నియంత్రణ చౌక.
________________________________________
వ్యాక్సిన్ దొరికేదెక్కడ..?
Shareవిజ్ఞాన వీచిక డెస్క్ Wed, 16 Nov 2011, IST
* హైదరాబాద్‌లో నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో 24 గంటలూ అవసరమైన వారికి ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తారు.
* అన్ని ప్రధాన టీచింగ్ హాస్పటల్స్‌లో దొరుకుతుంది.
* అన్ని టీచింగ్, జిల్లా, రెవెన్యూ స్థాయి ఆసుపత్రులలోనూ లభిస్తుంది.

* కొన్ని ప్రయివేటు మందులషాపుల్లో కూడా దొరుకుతున్నాయి. కాకపోతే, కొనేటప్పుడు గడువుతేదీ సరిచూసుకొని, నిల్వ స్థితిని తెలుసుకోవాలి.
* మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఎక్కువగా రేబిస్‌కు బలవుతున్నారు. దీని నియంత్రణకు అవసరమైన వ్యాక్సిన్ ప్రాథమిక చికిత్సా కేంద్రాల స్థాయిలో లభ్యం కావాలి. కానీ ఇది దొరకక ఎంతోమంది పేదలు చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్ల, వెంటనే ఈ వ్యాక్సిన్‌ను రాష్ట్రంలో ప్రాథమిక చికిత్సా కేంద్రాల స్థాయి వరకూ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
*తెలియని జంతువుల దగ్గరకు వెళ్లకూడదు.
* రేబిస్ రాగల ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలి.
* ఇంట్లో పెంపుడు జంతువులకు నాలుగు నెలల వయస్సులోనే వ్యాక్సిన్‌ను ఇప్పించాలి. తర్వాత ఒక సంవత్సరానికి బూస్టర్‌డోస్ ఇప్పించాలి. ఆ తర్వాత 1-3 సంవత్సరాల్లోపు మరో బూస్టర్ డోస్‌ను ఇప్పించాలి.
* ఇంట్లో పెంచుకునే కుక్కలకు పునరుత్పత్తి కాకుండా చికిత్స చేయించాలి.
* వీధి కుక్కల్ని, జంతువుల్ని కట్టడి చేయాలి. అలాగే వీటికి కూడా పునరుత్పత్తి లేకుండా చేయాలి.
* ఉదయం వ్యాహ్యాళికి వెళ్లినప్పుడు చేతిలో ఒక చిన్నకర్ర ఉంటే మంచిది.
__________________________________________
లూయీపాశ్చర్...
Shareవిజ్ఞాన వీచిక డెస్క్ Wed, 16 Nov 2011, IST
వ్యాక్సిన్ మందు ఆవిష్కకర్త లూయీపాశ్చర్. ఈయన డిసెంబర్ 27, 1822న జన్మించి, 28 సెప్టెంబర్, 1895న మరణించాడు. ఈయన ఫ్రెంచి దేశస్థుడు. వ్యాధులకు మూల కారణం సూక్ష్మజీవులని సిద్ధాంతీకరించి, రోగనిర్ధారణకు, నివారణకు బాటలు వేశాడు. మొదటిసారిగా రేబిస్ వ్యాధి నియంత్రణకు వ్యాక్సిన్‌ను తయారుచేశాడు. దీనితోపాటు పశువుల్లో ఆంథ్రాక్స్, మనుషుల్లో పొంగు వంటి వాటికి కూడా వ్యాక్సిన్‌లను తయారుచేశాడు. పాల నిల్వను పెంచడానికి పాశ్చరైజేషన్ పద్ధతిని కూడా కనిపెట్టాడు. కోళ్ళకు వచ్చే కలరా వ్యాప్తిని నిరోధించే మందును కూడా కనుగొన్నాడు. ఈ రోజున మానవాళి ఈయన ఆవిష్కరణ ఫలితాలను ఎన్నో రూపాల్లో అనుభవిస్తోంది. ఆయన జీవితం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.
* రేబిస్‌ను నియంత్రించలేమనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ వ్యాక్సిన్ల ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.
* జంతుకాటు ద్వారా మాత్రమే ఈ వ్యాధి వ్యాపిస్తుందని మరో అపోహ ఉంది. వాస్తవమేమంటే జంతువులు నాకినా లేదా ఆడుకునే సమయంలో చిన్నగా గీరుకున్నా, మానవ శరీరం మీద అంతకుముందే ఏర్పడిన గాట్లు లేదా గాయాలపై వ్యాధి సోకిన కుక్క లేదా పిల్లి లాలాజలం పడినా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
* దాదాపు 72 శాతం మందికి జంతువుల ద్వారా రేబిస్ వ్యాపిస్తుందని పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వారికి కూడా తెలియదని ఒక సర్వే సూచించింది.
* రేబిస్ సోకి చనిపోయిన పశువుల మాంసాన్ని కుక్కలు తిన్నప్పుడు వాటికి రేబిస్ సోకుతుంది.
* ఫ్రిజ్‌లో గడ్డకట్టుకుపోయి, కరిగిన వ్యాక్సిన్ మందు పనిచేయదు. వాడకూడదు.
* ఇంట్లో తిరిగే లేదా పెంచే కుక్కలు, పిల్లులకు రేబిస్ నివారణ వ్యాక్సిన్‌ను ఇప్పించాలి. అప్పుడు అవి కరిచినా రేబిస్ రాదు.
* పశువులకు, మనుషులకు ఇచ్చే రేబిస్ నివారణ వ్యాక్సిన్లు వేర్వేరుగా ఉంటాయి.
* రీకాంబినెంట్ వ్యాక్సిన్లను వాడి బెల్జియం, ఫ్రాన్సు, జర్మనీ, అమెరికాల్లోని అడవి జంతువుల్లో రేబిస్‌ను విజయవంతంగా నివారించారు.
* కోడిగుడ్డులోని పిల్ల జీవకణాల నుండి చేసే రేబిస్ వ్యాక్సిన్ ఇప్పుడు చౌకగా దొరుకుతుంది. దీన్ని రీకాంబినెంట్ (వి-ఆర్‌జి) రేబిస్ వ్యాక్సిన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను నోటి ద్వారా కూడా ఇవ్వవచ్చు.
* ఎర (బెయిట్) ఆహారం రూపంలో అడవి జంతువులకు (వి-ఆర్‌జి వ్యాక్సిన్) ఇస్తున్నారు.
_____________________________________________________________
|
Series of National Level Workshops for Transit of Venus- 2012 |

Image Credit: www.exploratorium.edu |
Eclipse, when two objects of comparable sizes block each other, occultation, when a body with greater angular size blocks an object with smaller angular size and transits, when an object with lesser angular size come in between the observer and an object with greater angular size are some of the celestial wonders that naturally occur due to movements of the celestial bodies.
|
One such cosmic event, the Venus Transit- passing of Venus in front of Sun’s disk will take place on the coming 06 June 2012. The transit of Venus occurs in pairs with one that took place on 08 June 2004. The next pair of transit of Venus will occur in 2117 and 2125, making it truly once in life time opportunity.
|
The first recorded observation of the transit of Venus was done by the British Priest, Jeremiah Horrocks, in 1639. Jeremiah Horrocks was the first who used his observations to measure the Earth to Sun distance, called the Astronomical Unit (AU). The upcoming Transit of Venus- 06 June 2012 will be a life time opportunity for everyone on the Earth. In India, on 06 June 2012, transit will commence well before sun rises and one can observe the phenomena on Sun’s projected image or through approved solar filters supplied by authorised agencies from morning hours to mid morning.
|
Keeping this event as a peg, VP is proposing to organise a series of regional training programme in different parts of the country between April and May 2012 to train and make a set of resource persons on conducting Day Time Astronomy activities. Each participants of the workshop would have to undertake to initiate activities on Day time astronomy at least in ten villages/ schools.
|
Vigyan Prasar invites amateur astronomers, science activists, science communicators, teachers (School and college) who are desirous of joining the regional training programme, and who are ready to give undertaking that they will at least conduct 10 field level programmes subsequent to receiving the training may apply. The last date for application is 20 March 2012.
|
The shortlisted applicants will be informed through mail/letter/phone by 01 April 2012. The travel support restricted to AC-II and frugal accommodation at the place of training programme will be provided by Vigyan Prasar.
|
________________________________________________
సీవీ రామన్.. నోబెల్ ప్రైజ

రామన్ అనగానే అందరికీ నోబెల్ బహుమతి జ్ఞాపకం వస్తుంది. కానీ, ఆ బహుమతితో అసంతృప్తికి గురయినవారు కూడా ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు. 1913 నుంచీ రష్యాలో లాండ్ స్ట్రామ్, లాండ్స్ బెర్గ్ అనే ఇద్దరు పరిశోధకులు, రామన్ జరుపుతున్న రకం పరిశోధనలు సాగించారు. 1925లో వారి పరిశోధన క్వార్ట్జ్ అనే పదార్థంతో కొనసాగింది. రష్యాలో క్వార్ట్జ్ కావలసినంత దొరుకుతుంది. కానీ వ్యాపారులు ఈ పరిశోధకులను మోసపుచ్చి చవకబారు సరుకును అంటగట్టారు. వారికి 1928లో గానీ మంచి క్వార్ట్జ్, మంచి ఫలితాలు అందలేదు. అప్పుడుగానీ వారికి రామన్‌కు వచ్చిన లాంటి ఫలితాలు రాలేదు! వచ్చిన తర్వాత కూడా నమ్మకం కుదరక వారు తమ ఫలితాలను ప్రచురించలేదు. రామన్ తన పరిశీలనలు ప్రచురించిన తర్వాత అందరికీ, రష్యన్‌ల పరిశోధన గురించి అర్థమయింది. వాళ్లు తమ పరిశోధన ఫలితాలను ప్రచురించేలోగా విషయం మీద 16పత్రాలు వచ్చేశాయి. రామన్ ఐఫెక్ట్ పుట్టేసింది! తరువాత కూడా రష్యనులు దాన్ని రామన్ స్కాటరింగ్ అనలేదు. కానీ, కాలక్రమంలో వారికి కనువిప్పు కలిగింది. సైన్సు పద్ధతిలో సంగతిని చర్చకు పెట్టి అవుననుపించడం ముఖ్యమయిన భాగం!
1928లోనే రామన్‌కు నోబెల్ వస్తుందనుకున్నారు కానీ రాలేదు. 1929లో కూడా రాలేదు. 1930లో రామన్, తనకూ, భార్యకూ యూరపు వెళ్ళడానికని టికెట్లు కొన్నారు. ఆ తర్వాత నోబెల్ బహుమతి ప్రకటించబడింది. 1930 డిసెంబరు పదవ తేదీన స్టాక్‌హోమ్‌లో బహుమతి ప్రదానం జరిగింది. ఆ సందర్భంగా అమెరికా ప్రతినిధిగా వచ్చిన అధికారి రాసిన మాటలు అందరూ చదవదగినవి.
‘‘నోబెల్ బహుమతి గ్రహీతలందరికీ, భారతీయ విజేత, సర్ వెంకట్రామన్‌గారి మీద అందరి దృష్టి కేంద్రీకరింపబడింది. రాజుగారి చేతుల మీదుగా బహుమతి అందుకున్న తర్వాత ఆయన భావోద్వేగానికి గురవుతూ తమ స్థానానికి తిరిగి వచ్చారు. అతని కళ్లనుండి బాష్పాలు స్రవించాయి. తరువాత డిన్నర్ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఒక మాస్టర్ పీస్. హాలులోని అందరూ ప్రసంగం తర్వాత గొప్పగా అప్లాస్ తెలియజేశారు’’ అని అధికారి తమ దేశానికి వర్తమానం పంపారు.
‘నా సీటుకువచ్చిన తరువాత నాకు చుట్టూ, తెల్లవారి ముఖాలు మాత్రమే కనిపించాయి. వారి మధ్యలో ఒంటరిగా, నేను, కోటు, తలపాగాలతో, ఒక భారీయుడిని మిగిలాను. నా దేశం, నా ప్రజల ప్రతినిధిగా నేనున్నాననిపించింది. మహారాజుగారి నుంచి బహుమతి అందుకునే సమయాన నేను నమ్రభావానికి గురయ్యాను. నన్ను నేను తమాయించుకున్నాను. పైన చూస్తే, నా వెనుక బ్రిటీష్ జెండా కనిపించింది. దేశం పరిస్థితి మనసులో మెదిలింది. మనకొకజెండా కూడా లేదు! నా ఉద్వేగం దాంతో కట్టలు తెగింది’ అని రాసుకున్నారు రామన్!
సైన్స్‌సైట్ -- వైద్య చికిత్సలో కిరణాలు
నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ 1928లో ఒక బలహీనమైన వికిరణాన్ని కనుగొన్నారు. దానినే రామన్ వికిరణం అంటారు. ఆనాటి నుండి ఈ రామన్ వికిరణం భౌతిక, రసాయన ప్రయోగాల్లో ఎంతో ఉపయోగపడుతోంది.
ఇప్పుడు అమెరికాలోని శాస్తవ్రేత్తలు ఈ రామన్ స్పెక్ట్రో స్కోపిని ఉపయోగించి గుండె ధమనుల్లో వున్న ప్లేక్స్ (రక్త ప్రవాహాన్ని నిరోధించే పదార్థాలు) రసాయనిక తత్త్వాన్ని అంచనా వేయగలిగారు.
ధమనుల్లో ప్లేక్స్ పేరుకుపోయిన కొలది రక్తప్రవాహం మందగిస్తుంది. హృదయ ధమనుల్లో ప్లేక్స్ ఒకే స్థాయిలో ఉండవు. ఒకచోట ఎక్కువగాను, మరొకచోట తక్కువగాను ఉంటాయి. ప్లేక్స్ వల్ల అప్పుడప్పుడు గుండె నొప్పి రావడం, ధమనుల గోడలు చిట్లడం జరుగుతుంది. ఒక్కొక్కసారి రక్తం గడ్డ కట్టే ప్రమాదం కూడా ఉంటుంది.
ప్రమాదకరమైన ఈ ప్లేక్స్ రకరకాల రసాయనాలు కలిసి ఏర్పడతాయి. ప్లేక్స్‌లోని రసాయనాలు తెలుసుకోగలిగితే, అవి ధమనుల గోడలు చీలుస్తాయా లేదా అనే విషయాన్ని, వాటిని తొలగించడానికి కావలసిన చికిత్సా విధానాన్ని నిర్ధారించవచ్చు.
రోగి మరణించాక గాని ధమనుల్లో ఇరుక్కున్న ప్లేక్స్ రసాయనిక తత్త్వాన్ని పసిగట్టడం సాధ్యమయ్యేది కాదు. ధమనిలో ప్లేక్స్ ఉన్న చోటుకి చొచ్చుకొని వెళ్లి కావలసిన సమాచారాన్ని అందించే పరికరాలు కరువయ్యాయి. ఇలాంటి చోటనే రామన్ కిరణాలు అక్కరకు వస్తున్నాయని అమెరికన్ శాస్తవ్రేత్తలు ప్రకటించారు.
విశే్లషణ
ఒక రసాయనిక పదార్థం నుండి వచ్చే కాంతిని విశే్లషించి ఆ పదార్థాన్ని నిర్ధారించడం స్పెక్ట్రోస్కోపితో సాధ్యం. ఒక రసాయన పదార్థం మీదికి లేజర్ కాంతిని ప్రసారం చేసినపుడు అందులోని అణువులు కాంతిని గ్రహించి, తిరిగి పరావర్తనం చెందేలా చేస్తాయి.
ముందు ప్రసరింపజేసిన కాంతి తరంగాల వేవ్‌లెంగ్త్‌కు, రసాయనిక పదార్థం నుండి వెనుదిరిగి వచ్చిన కాంతి తరంగాల వేవ్‌లెంగ్త్‌కు తేడా ఉంటుంది. ఈ పరావర్తన కాంతి వర్ణ పటాన్ని గమనిస్తే ఆ పదార్థంలోని రసాయన మూలకాలు తెలుసుకోవచ్చునని రామన్ సిద్ధాంతం.
ఈ సిద్ధాంతాన్ని ఎన్నో ఏళ్లుగా రసాయన శాస్తవ్రేత్తలు ఉపయోగిస్తున్నారు. ఈ సిద్ధాంతం హృద్రోగ చికిత్సలో సైతం కీలకమవుతోంది. పరిశోధకులు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నవారి పాత గుండె ధమనులను పరీక్షించారు. తరువాత దశలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్న వారి ధమనుల్లో ప్లేక్స్‌ను రామన్ స్పెక్రోస్కోపి ద్వారా పరిశీలించారు. గుండె జబ్బులతో బాధపడుతున్న మిగిలిన వారికి మరో విధానాన్ని అనుసరించారు. మూత్రనాళిక గుండా ఆప్టిక్ ఫైబర్‌ను ధమనుల్లో సమస్యవున్న ప్రదేశానికి పంపిస్తారు.
బయట నుండి లేజర్ కాంతిని ఆప్టిక్ ఫైబర్ మీదకు ప్రసరింపజేస్తారు. పరావర్తనం చెందిన కిరణాలను మూత్రనాళికలో మరొక వైపునున్న డిటెక్టర్ పరిశీలిస్తుంది. బలహీనమైన రామన్ వికిరణాల సంకేతాలను పసిగట్టే సున్నితమైన డిటెక్టర్‌ను తయారుచేయడం వంటి చిన్నచిన్న సమస్యలు ఇంకా అధిగమించాల్సి ఉంటుంది.
ప్రోటాన్ కిరణాలు
అణు భౌతిక పరిశోధనలో ఉపయోగించే ప్రోటాన్ కిరణాలు వివిధ రకాల కేన్సర్లను సమర్థవంతంగా తగ్గిస్తున్నట్లు అమెరికా పరిశోధకులు వెల్లడించారు. ఈ కిరణాలు కేన్సర్ కణితి సమీపంలోని కణజాలానికి ఎటువంటి హాని కల్గించవు.
ప్రోస్టేట్, ఎముక, కంటి కేన్సర్ చికిత్సలో ఇప్పటివరకు రేడియో ధార్మిక వికిరణాలను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాధులను ప్రోటీన్ కిరణాలతో చికిత్స చేసినపుడు మరింత ఉత్తమమైన ఫలితాలు లభించాయని అమెరికన్ వైద్య పరిశోధకులు చెబుతున్నారు.
కేన్సర్ కణితి గుండా ఒకే స్థాయిలో వికిరణ డోస్ పంపుతారు. అదే సమయంలో కణితి పరిసరాల్లోని ఆరోగ్యవంతమైన కణజాలం దెబ్బతినకుండా చూసేందుకు జీరో డోస్‌లో రేడియో ధార్మిక వికిరణాలను పంపుతారు.
రేడియేషన్ థెరపీలో ఉపయోగించే ఫోటాన్ కిరణాలు శరీరం గుండా ప్రయాణించే సమయంలో కొంత శక్తిని కోల్పోతాయి. అంతేగాక కిరణాలు శరీరంలోకి ప్రవేశించవలసిన చోట చర్మంపై అత్యధికంగా కేంద్రీకృతమవుతాయి.
శరీరం మందాన్నిబట్టి లోనికి ప్రవేశించాల్సిన కిరణాల్లో కొన్నింటి శక్తి క్షీణిస్తుందని పరిశోధకులు గమనించారు. కేన్సర్‌కు గురైన ప్రోస్టేట్ గ్రంథిని శస్తచ్రికిత్స ద్వారా తొలగించినపుడు కలిగిన ఫలితమే ప్రోటాన్ కిరణాల చికిత్సలో కూడా లభించడం విశేషమంటున్నారు ఈ వైద్య పరిశోధకులు.
కూల్‌డ్రింకును తాగెవారికి షాక్‌న్యూస్

పురుగుమందులున్నాయన్న భయంతో గతంలో
కూల్‌డ్రింకులను కొంతకాలం దూరం పెట్టాం.మళ్లీ వేసవికాలమొచ్చే
సరికి షరామామూలే. కానీ.. శీతల పానీయాలు ఖచ్చితంగా
డేంజరస్సనడానికిమరో రీజన్ దొరికింది. చక్కెరపాళ్లు ఎక్కువగా
వుండే కార్బొనేటెడ్ ఎలిమెంట్స్ వల్ల కూల్‌డ్రింక్స్ మనిషికి ప్రమాదం
తెచ్చిపెడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. క్లోమ కాన్సర్‌కు దారితీసే
ఇలాంటి కూల్‌డ్రింకులు.. వారానికి రెండుసార్లకు మించి తీసుకోకూడదట.
సింగపూర్‌లో 14 ఏళ్లలో ఏకంగా 60 వేలమంది జనం ఈ కాన్సర్‌బారిన పడ్డట్టు
తేలింది. శీతలపానీయాలను మోతాదుకుమించి వినియోగించే ఇండియాలో
కూడా ఈ ప్రమాదం పొంచివుందట. సో.. సమ్మర్‌లో సేదదీరదామని
కూల్‌డ్రింకును టచ్ చేసేవారందరికీ ఇదో షాక్‌న్యూస్.
_________________________________________________________________________
సైన్స్ ప్రచారం..
Shareవిజ్ఞాన వీచిక డెస్క్ Wed, 15 Feb 2012, IST

జాతీయ శాస్త్ర, సాంకేతిక సంస్థ, ఆలిండియా రేడియో సహకారంతో 'నిత్యజీవితంలో రసాయనిక శాస్త్రం' అనే అంశంపై 30 నిమిషాల వ్యవధితో 13 ఎపిసోడ్‌లను రూపొందించి, ప్రసారం చేసింది. 'ఆధునిక సైన్సు ఆవిర్భావం' పై మరో 13 ఎపిసోడ్‌ల కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. 'అంతర్జాతీయ భూగ్రహ వార్షికోత్సవ (2008లో)' సందర్భంలో 52 వారాలు ధారావాహిక ప్రసార కార్యక్రమాల్ని నిర్వహించింది. 'అంతర్జాతీయ భౌతికశాస్త్ర దినోత్సవం (2005)' లో భాగంగా 'ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్' విగ్రహాన్ని తిరుపతిలో ఆవిష్కరించింది. 'చెకుముకి' అనే బాలల సైన్స్ మ్యాగజైన్‌ను ప్రచురిస్తోంది. 'చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్' పేరుతో ప్రతి సంవత్సరం విజ్ఞానోత్సవాలను నిర్వహిస్తుంది. పేరుకు మాత్రమే ఇది 'టెస్ట్' ఆచరణలో ఇదొక 'పిల్లల పండుగ'. తద్వారా పిల్లల్లో పరీక్షలంటే ఉన్న భయాన్ని పోగొడ్తుంది. ప్రతి పండుగలో లక్షలాదిమంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటు న్నారు. జీవితకాలం గుర్తుండే అనుభవం పొందుతున్నారు.
విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని ఇది చేస్తుంది. ప్రధానంగా మూఢవిశ్వాసాలు ప్రబలినప్పుడు వాటిని గురించి ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు అనేక ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గ్రహణం మొర్రి, చంద్ర, సూర్యగ్రహణాలు ఏర్పడినప్పుడు అవగాహనా కార్యక్రమాల్ని ప్రదర్శన రూపాల్లో చేస్తుంది. దొంగబాబాల మోసాలను బట్టబయలుజేస్తూ ప్రజల్ని చైతన్య వంతుల్ని చేస్తోంది. సైన్స్‌లో సృజనాత్మకతను జోడించి, బోధించేందుకు ఆ రంగంలోని ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగుతులు నిర్వహించింది. సైన్స్ బోధనకు తోడ్పడేలా తక్కువ ఖర్చుతో 'సైన్స్ కిట్స్'ను ప్రచారంలో పెట్టింది. చిన్న పిల్లల్లో సైన్స్‌పట్ల ఆసక్తిని పెంచడానికి 'బాలోత్సవ్‌లు, సృజనోత్సవాలు, బాలమేళాలు' వంటి పండుగలను పెద్దఎత్తున జరుపుతోంది.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
_____________________________________________________________________________________
చేసిన కృషి.. గుర్తింపు..
Shareవిజ్ఞాన వీచిక డెస్క్ Wed, 15 Feb 2012, IST
'ప్రజల కోసం సైన్స్.. శాంతి కోసం సైన్స్.. ప్రగతి కోసం సైన్స్.. నిజం కోసం సైన్స్... స్వావలంబన కోసం సైన్స్..' వంటి నినాదాలను ప్రచారంలో పెట్టింది. తద్వార నిత్యజీవితంలో విజ్ఞానశాస్త్ర ప్రాధాన్యత ప్రజలచే గుర్తించడానికి కృషి చేసింది. జాతీయ శాస్త్ర, సాంకేతిక సంస్థలతో కలిసి జనవిజ్ఞాన వేదిక విద్య, వైద్య, విజ్ఞానశాస్త్ర ప్రచారాలను పెద్దఎత్తున చేపట్టింది. గ్రామ, మండల, జిల్లా స్థాయి మొదలుకొని, రాష్ట్రస్థాయి వరకూ అభివృద్ధిని ఆటంకపరుస్తున్న సమస్యలను గుర్తిస్తూ పరిష్కారానికి కృషి చేసింది. ముఖ్యంగా మహిళలకు గల హక్కుల్ని గుర్తింప జేస్తూ, వారిని స్వశక్తీకరించింది. సాంఘిక రంగంలో 'సమతా విభాగం' పేర కృషి చేస్తుంది. ఈ వేదిక చేస్తున్న 'ఎనలేని సేవలకు' గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగాల నుండి 2005 'జాతీయ అవార్డు'ను పొందింది. 25వ సంవత్స రంలోకి అడుగిడుతూ 'రజితోత్సవాల'ను జరుపుకుంటున్న జనవిజ్ఞానవేదిక 50 వేలకు పైగా సభ్యత్వం కలిగి ఉంది. ప్రధానంగా ఉపాధ్యాయులు, వైద్యులు, మేధావులు, శాస్త్రవేత్తలు, ప్రజాసైన్స్ ఉద్యమాభిలాషులు ఎందరో దీనిలో సభ్యులుగా ఉన్నారు.
_________________________________________________________________________________________
Indian Science Teacher selected for US Space Programme
|
Indian Science Teacher selected for US Space Programme |
 |
 |
 |
|
Written by Breaking News Online Team |
|
Tuesday, 31 January 2012 16:33 |
|
News Desk: A teacher from Maharashtra has made the country proud in the space and science education after he was selected for the US Space Foundation's elite 2012 Flight of Teacher Liaisons programme.
Vandana Suryawanshi is a middle school educator at Vidya Valley School in Maharashtra. He has been teaching biology, earth science and general science for past 20 years.
Vandana joined 19 other outstanding teachers, who were selected for promoting space and science education. The teachers in the programme will advocate for the space education across the curriculum. They will get the training from the Space Foundation to promote space awareness activities.
A total of 270 teachers have been participating at the Space Foundation Teacher Liaison programme. The 2012 Teacher Liaisons will be recognised at the Space Foundation's 28th National Space Symposium where the teachers will participate in education programmes. It will be held on April 16-19 at Broadmoor Hotel in Colorado Springs, Colorado.
___________________________________________________________________________________________________________________
|

_________________________________________________________________________________________________________________________________
TODAY'S PAPER » NATIONAL » ANDHRA PRADESH
CHILAKALURIPET, December 31, 2011
A teacher's tribute to scientists
P. SAMUEL JONATHAN
‘Science is life and the scientists, who have made our lives better, should be revered'
Life's passion:M. Ashok shows around the scientist corridor at Chilakaluripet.— Photo: T. Vijaya Kumar
A teacher has given shape to his enthusiasm for science by erecting statues of scientists on his estate. Maddukuri Ashok, who teaches physical sciences at Zilla Parishad High School at Yallamanda, has put up statues of 19 eminent scientists in what he calls a “scientist corridor.”
“The statues of Albert Einstein, Charles Darwin, Madam Curie, and Sarvepalli Radhakrishanan made of fibre glass have been put up in a row amidst green fields by this ardent enthusiast of science. A plaque carrying their names and the distinction they achieved is installed on the pedestal. Each bust-size image is erected on a granite pedestal and Mr. Ashok is now laying a BT road so that students can visit the place.
“I do not believe in God or religion. Science is life and the scientists, who have made our lives better, comfortable, and healthy should be revered,” Mr. Ashok says.
His keen interest in science prompted him to make fibre glass bust portraits and distribute them free to government schools. In 2004, he organised a procession of statues in Vijayawada and Hyderabad, catching the attention of the public. He published calendars and posters with details of important scientific discoveries in the last few centuries.
“I suffered monetary losses when I stretch my enthusiasm a bit too far. The rising cost of production has made my job difficult. But I could resume my interest after my real estate business picked up,” Mr. Ashok says.
Having set up the Maddukuri Foundation recently, Mr. Ashok is planning to set up a mini theatre to screen short films about the lives of scientists and origin of man.
_____________________________________________________________________________________________________
Take another look…
FAIZA FATIMA HASAN
The HinduFor a better peek: Kids at t the G.P. Birla Observatory and Astronomical Research Centre Photo: Nagara Gopal
The new telescope, a Cassegrain-Schmidt, at the B.M Birla Science Centre is compact and computerised and this has some advanced abilities too.
Galileo's astounding observations got many angry responses from the conservative society that he lived in, but since then the telescope has come a long way.
Today, telescopes can potentially allow us to see the deepest, most unknown regions of space.
Telescopes are instruments that enable viewing far away objects more clearly.
B.M Birla Science Centre recently launched what is perhaps India's best amateur observatory. It was inaugurated by Nirmala Birla, wife of the late G.P. Birla, who gave Hyderabad its G.P. Birla Observatory because of his passion for astronomy and science.
The new observatory is a state-of-the-art five storeyed building with a cool, brand new telescope - The Cassegrain-Schmidt!
This telescope is compact and computerised and has some very advanced abilities.
Ninety-nine pre-assigned locations of important planets, stars and other bodies in the galaxy can be stored into the telescope for quick reference.
“In principle, this telescope has the potential to detect “exo-planets” or planets attached to other solar systems” adds Dr. B. G. Sidharth, Director General of the B. M. Birla Science Centre and also a very noted physicist.
For amateurs
The purpose of launching the new observatory is to cater to the amateur communities who have a passion for astronomy.
Not everyone knows that the Science Centre even offers certified courses on astronomy for amateurs, including children and that a large percentage of the many visitors that come to the B. M. Birla Science Centre each year are children from Andhra Pradesh as well as its neighbouring States.
“We hope that the new observatory will allow astronomy enthusiasts of all age groups enjoy or even contribute to astronomy.
It's not rare that amateurs and young students of astronomy sometimes make unexpected discoveries,” says Dr. Siddharth.
Keywords: telescope, scientific instruments
___________________________________________________
అందరికీ సుస్థిర ఇంధనం... సమస్యలు .. సవాళ్లు..
Shareవిజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Jan 2012, IST

భవిష్యత్తరాల అవకాశాలను తగ్గించకుండా ఇప్పటి ఇంధన అవసరాలను తీర్చుకోవడమే 'సుస్థిర ఇంధన వినియోగం'. ఆధునిక ఇంధన సేవలను అందరికీ అందించాలనే ప్రధాన లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 'అందరికీ సుస్థిర ఇంధన అందుబాటు' అన్న నినాదంతో 2012ను 'అంతర్జాతీయ సంవత్సరం'గా 2010-డిసెంబర్‌లో నిర్ణయించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో సుస్థిరాభివృద్ధికి, శతాబ్ధి అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఆధునిక ఇంధన (శక్తి) సేవల అందుబాటు అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇంధన సరఫరాలో ఇమిడి వున్న సమస్యలపై అన్ని దేశాల దృష్టిని మరల్చేందుకు, ఆధునిక ఇంధన సేవలు అందరికీ అందించేందుకు తోడ్పడాలని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి 'బాన్‌కీ మూన్' ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో.. సుస్థిర ఇంధన సేవలను అందరికీ అందించడం లోని సమస్యలను, సవాళ్లను సంక్షిప్తంగా తెలుపుతూ... మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.
ఆధునిక జీవితం, అభివృద్ధి ఇంధన వినియోగంతో ముడిపడి ఉంది. భూగర్భంలో దొరికే బొగ్గు, ముడి చమురు ఇప్పుడు ప్రధానంగా ప్రపంచ ఇంధన అవసరాలను తీరుస్తున్నాయి. ఇవి తరిగిపోయే వనరులు. ఈ నిల్వలను విచక్షణా రహితంగా వాడటంతో వాతావరణ, పర్యావరణ కాలుష్య సమస్యలు ముందుకు వస్తున్నాయి. వీటి అదుపులేని వినియోగాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తరాలకు ఇంధన అందుబాటు తగ్గి, వారి జీవితాలు అస్థిరమవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి ఇంధన వినియోగాన్ని క్రమంగా 'తరిగిపోయే వనరుల' నుండి 'తరగని, పునరుద్ధరించగల ఇంధన వనరుల' వినియోగం వైపు మళ్లించాలి. ఈ వనరుల్లో జల విద్యుత్, జీవ ఇంధనాలు, పవన విద్యుత్, సౌరశక్తి
లక్ష్యాలు..
* పేదలతో సహా అందరికీ ఆధునిక ఇంధన సేవలు అందేలా కార్యక్రమాల్ని నిర్వహించడం.
* 2015 నాటికి ఇంధన సామర్థ్య పెరుగుదలను రెట్టింపు చేయడం.
* 2030 నాటికి ప్రపంచ ఇంధన వనరుల వినియోగంలో పునరుపయోగించ గల వాటి వినియోగాన్ని రెట్టింపు చేయడం.
color"red">వినియోగం...
పునరుపయోగించగల ఇంధన వనరుల వినియో గంతోబాటు వీటి వినియోగ సామర్థ్య పెంపు కూడా దీనిలో ముఖ్యమైన భాగం. భవిష్యత్తరాల అవకాశాలను దెబ్బతీయకుండా, ముఖ్యంగా అధిక ఇంధనం అవసరమయ్యే ఉత్పత్తులు, సేవలు వివక్ష లేకుండా అందరికీ అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. సుస్థిర ఇంధన వినియోగంలో ఇది మరో భాగం.
ఎంతోకాలంగా జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. దీనివల్ల వస్తున్న పర్యావరణ సమస్యలు నామమాత్రం. అయితే, వీటి నిర్మాణంలో పెద్దఎత్తున భూమి ముంపుకు గురకావాల్సి వస్తుంది. నిర్వాసితులు అవుతున్నారు. నిర్మాణదశలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కూడా ఒక సమస్యే. అప్పుడప్పుడు వచ్చే భారీ వరదలు కూడా మరొక సమస్య. కానీ, ఒక మేర తరచుగా వచ్చే వరదల దుష్ప్రభావాల నివారణకు ఈ ప్రాజెక్టులు దోహదపడుతున్నాయి. మన దేశంలో నిర్మించబడ్డ బహుళ ప్రయోజనాలుగల సాగునీరు, జల విద్యుత్ ప్రాజెక్టులు దీనికి మంచి ఉదాహరణ. పరిమితికి మించిన వరదలు నష్టాల్ని కలిగిస్తున్నాయి.
భూగర్భ వేడి వినియోగంతో విద్యుదుత్పాదన అవకాశాలు అమెరికా, ఇండోనేషియా, తూర్పు ఆఫ్రికా, ఫిలిప్పైన్స్‌లాంటి దేశాల్లో భాగానే ఉన్నప్పటికీ మన దేశంలో ఈ వనరులకి అంత ప్రాధాన్యత లేదు.
బొగ్గుకు బదులుగా జీవశేష, వ్యర్థ పదార్థాల (మున్సిపల్ వ్యర్థాల) తో తయారుచేసే బ్రికేట్స్‌నే (ఇటుకల్లాంటివి) ఇంధనంగా వినియోగిస్తున్నారు. మనలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీటికి ప్రాధాన్యత ఎంతో ఉంది. బొగ్గుతో పోల్చినప్పుడు ఇవి 70 % సామర్థ్యం కలిగి ఉన్నాయి.
సౌరశక్తి వేడి సాంకేతికాలు..
సూర్యరశ్మి ద్వారా భూమికి చేరే వేడిని సేకరించే సాంకేతికం ఇది. మన దేశంలో దీనిని విరివిగా వినియోగించగలుగు తున్నాం. సోలార్‌కుక్కర్లు, సోలార్ వాటర్ హీటర్లు దీనికి ఉదాహరణ. దీని వినియోగాన్ని పెంచేందుకు అపార అవకాశాలు ఉన్నాయి.
విద్యుత్ వినియోగం..
1980, 90 దశకాల నుండి సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే 'ఫొటో ఓల్టెక్ సెల్స్' విరివిగా అందుబాటులోకి వచ్చాయి. పరిశోధనల వల్ల వీటి ఖర్చు తగ్గుతూ వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఉత్తర అమెరికాలో అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ (15 మె.వా) పనిచేస్తుంది.
పరిశుభ్రమైన వంట స్టవ్..
అసంపూర్తిగా ఇంధనం మండడం గృహ స్థాయిలో ఆరోగ్య, వాతావరణ సమస్యలను, ఇతర ఇబ్బందుల్ని పెంచుతుంది. పరిశుభ్రమైన పొయ్యి సామాజికపరంగా పేదల అవసరాల్ని తీర్చేలా ఉండాలి.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పిడకలు, పంటల శేష పదార్థాలు, పచ్చికట్టెను సాంప్రదాయ వంట చెరకుగా వాడుతున్నారు. ఈ పద్ధతిలో పొగబారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీన్ని అధిగమించడానికి అత్యంత పరిశుభ్రమైన, ఆధునిక గ్యాస్ పొయ్యిలు, విద్యుత్‌పొయ్యిలు, సోలార్ కుక్కర్ వంటి వాటిని అందుబాటులోకి తేవాలి. వీటిమధ్య కిరోసిన్ పొయ్యిలు గ్రామీణ వంటచెరుకుతో పోల్చినప్పుడు సమర్థవంత మైనవి. కాలుష్య కారక వాయువుల విడుదలను 90% తగ్గించేస్తాయి. ఇంధన శక్తి వినియోగ సామర్థ్యం 50-70% మధ్య ఉంటుంది. ఎల్‌పిజి గ్యాస్ కన్నా కిరోసిన్ తక్కువ సామర్థ్యం కలది. కానీ, సాంప్రదాయ వంట చెరకుతో పోల్చినపుడు సమర్థవంతమైంది.
సోలార్ కుక్కర్‌లు సూర్యరశ్మి ఉన్నప్పుడే పనిచేస్తాయి. సూర్యరశ్మిలేని సమయాల్లో ప్రత్యామ్నాయ పొయ్యిలను వాడాలి. ఈ నేపథ్యంలో పేదలందరికీ సమర్ధవంతమైన పొయ్యి, చౌకైన ఆధునిక వంట ఇంధనం (గ్యాస్), సోలార్‌కుక్కర్ తదితరాలు అందుబాటులోకి రావాలి.
పునరుద్ధరించగల సాంకేతికాలు..
ఇవి తరిగిపోతున్న భూగర్భ ఇంధన వనరుల (బొగ్గు, ముడిచమురు) పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. భూగోళ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి తోడ్పడతాయి. ఈ వనరుల మూలం సౌరశక్తి. ఈ సాంకేతికాలను స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
మొదటితరం: పారిశ్రామిక విప్లవం ద్వారా ఈ సాంకేతికాలు 19వ శతాబ్ధం నుండి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ సాంకేతికాలే వినియోగించగల శక్తిని అందించడంలో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. వీటిలో జల విద్యుత్, జీవ వృక్ష, వ్యర్థాల్ని కాల్చడం, భూగర్భ వేడిని వినియోగించడం తదితరాలు ఉన్నాయి.
రెండోతరం: ఇందులో సౌరశక్తితో వేడి చేయడం లేదా చల్లార్చడం, పవన శక్తి వినియోగం, జీవ ఇంధన వినియోగం, సౌరశక్తిని విద్యుత్తుగా మార్చే ప్రక్రియలు (ఫొటో ఓల్టిక్ సెల్స్). ఇవన్నీ 1980 దశకంలో విరివిగా వాడకంలోకి వచ్చాయి. 1973-79లో ప్రపంచ ఇంధన సరఫరాలో వచ్చిన సంక్షోభం వల్ల ఈ సాంకేతికాల అభివృద్ధి కోసం పరిశోధనలు, వినియోగం కోసం, పెద్దఎత్తున నిధులు కేటాయించబడ్డాయి. తద్వారా వీటి వినియోగం క్రమంగా పెరుగుతోంది.
మూడోతరం: ఇవి అభివృద్ధి దశలోనే ఉన్నాయి. ఆధునిక జీవ ఇంధన వినియోగ పద్ధతులు, జీవ శుద్ధి పరిశ్రమల సాంకేతికాలు, ముఖ్యంగా సౌరశక్తి వినియోగ పద్ధతులు, భూగర్భ ఉష్ణ వినియోగ పద్ధతులు, సముద్ర అలల శక్తి వినియోగం తదితరాలు ఈ కోవ కిందకే వస్తున్నాయి.
వీటిలో మొదటి రెండుతరాల సాంకేతికాలు ఇప్పటికే వాణిజ్యస్థాయిలో వినియోగించ బడుతున్నాయి. మార్కెట్లో కూడా ఉన్నాయి. కానీ మూడోతరం సాంకేతికాలు చురుకైన పరిశోధన, అభివృద్ధి స్థాయిలోనే కొనసాగుతున్నాయి. మొదటితరం సాంకేతికాలు ఆర్థిక సామర్థ్యం రూపంలో రెండోతరం సాంకేతికాలతో పోటీపడుతున్నాయి.
ముఖ్య కార్యక్రమాలు..
* యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబూదాబీలో జనవరి 16-18 మధ్య ప్రపంచ భవిష్యత్తు ఇంధన అవసరాలపై జరగనున్న కాన్ఫరెన్స్‌లో అంతర్జాతీయ సుస్థిర ఇంధన సేవలు అందరికీ అందించే వార్షిక కార్యక్రమం ప్రారంభం.
* ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో ఆసియా ప్రాంత కార్యక్రమాలు ప్రారంభం.
* జూన్ 6-4 మధ్య బ్రెజిల్‌లోని 'రియో డీ జనరో'లో సుస్థిరాభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ నిర్వాహణ.
* సెప్టెంబర్ 18-21 మధ్య అందరికీ సుస్థిర ఇంధన అందుబాటు కార్యక్రమాలపై జనరల్ అసెంబ్లీలో ప్రత్యేక నివేదిక.
విధానాలే కీలకం..
అంతిమంగా వివిధ రకాల ఇంధనాల వినియోగం, వినియో గించే పద్ధతి, సామర్థ్యం ప్రభుత్వ విధానాల మీద ఆధారపడి ఉంటుంది. వ్యూహాత్మక జోక్యంతో సుస్థిర ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ అందరికీ నాణ్యమైన ఇంధనాన్ని అందించవచ్చు. ముఖ్యంగా వేగంగా అభివృద్ధిపర్చిన ప్రజా రవాణా సౌకర్యాన్ని కాలుష్యరహిత ఇంధనతో నిర్వహిస్తూ, వినియోగాన్ని తగ్గించవచ్చు. కానీ, మన దేశంలో వ్యక్తిగత రవాణా సౌకర్యాలకు వూహించలేని స్థాయిలో ప్రాధాన్యత పెరుగుతుంది. ఫలితంగా ముడి చమురు, బొగ్గు దిగుమతులు పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా, జీవ ఇంధనాల వాడకాన్ని, సౌరశక్తి వినియోగాన్ని గరిష్ఠ స్థాయికి పెంచి ఇంధన అవస రాల్ని తగ్గించవచ్చు. పేదలందరికీ సమర్ధవంతమైన పొయ్యిల్ని, ఆరోగ్యకర ఇంధనాన్ని భరించగలిగే ధరకు అందించి, వారి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, పర్యావరణ కాలుష్యాన్ని కనీసస్థాయికి తగ్గించవచ్చు.
వ్యవసాయోత్పత్తి ప్రధానంగా స్థానిక స్వభావంగలది. సుదూర మార్కెట్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఉత్పత్తి విధానం ఇంధన అవసరాలను పెంచుతోంది. స్థానిక అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని, సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో ఉత్పత్తి ఇంధన అవసరాలను ఏమేర తగ్గించగలవో అని తెలుసుకోడానికి క్యూబా అనుభవాలు ఆదర్శవంతంగా మనముందున్నాయి. ఈ సమాచారాన్ని గతంలో ఇచ్చాం. ఈ విషయంలో చైనా అనుభవాలు కూడా ఎంతో తోడ్పడతాయి. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో కొత్త సాంకే తికాల వినియోగానికి, ముఖ్యంగా వీటి దిగుమతులకు ప్రోత్సాహం ఇస్తుంది. వ్యవసాయ రంగంలో కొత్తగా వస్తున్న సాంకేతికాల్లో ఎక్కువ భాగం అధిక ఇంధన వినియోగం మీద ఆధారపడుతున్నాయి. పర్యావరణ సమస్యలు పెంచేవిగా ఉన్నాయి. ఈ సాంకేతికాలన్నీ సాంప్రదాయ, సుస్థిర సేద్య పద్ధతులకు బదులుగా వస్తున్నాయి. తక్కువ ఇంధన వినియోగం మీద ఆధారపడి, పర్యావరణపరంగా సురక్షితమైన సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ వంటి పద్ధతుల మీద కాకుండా అశాస్త్రీయ అధిక ఎరువులు, సస్యరక్షణ మందుల వాడకం మీద ఆధారపడుతున్నాయి. దీనికి బదులుగా కొత్త సాంకేతికాల ఇంధన అవసరాలను అంచనా వేసి, స్థానిక అవకాశాలతో పోల్చిన తర్వాతనే అనుమతివ్వాలి. తద్వారా ఇంధన వినియోగాన్ని కనీస స్థాయికి తగ్గించవచ్చు. ఇవేవీ ప్రభుత్వానికి తెలియదని కాదు. కానీ, ఈ దృష్టితో ఆలోచించి, నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇప్పుడైనా సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిద్దాం.
మీకు తెలుసా..?
* మన దేశ ఇంధన అవసరాల్లో 52% బొగ్గు తీరుస్తుంది.
* ఇప్పుడు 17 అణు విద్యుత్ కర్మాగారాలు 4.2% మేర విద్యుత్ అవసరాల్ని తీరుస్తున్నాయి. వచ్చే 20 సంవత్సరాల్లో ఈ కర్మాగారాలు 9% విద్యుత్ అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది.
* పవనవిద్యుత్ మొత్తం అవసరాల్లో 1.6% మేర తీరుస్తుంది. ఋతు పవనాల కదలికలపై వీటి ప్రభావాల్ని అధ్యయనం చేయాల్సి ఉంది.
* రవాణా ఇంధన అవసరాల్లో 80% పెట్రోలియం ఉత్పత్తులు తీరుస్తున్నాయి. దీనిలో 25-30% దేశంలోనే ఉత్పత్తి అవుతుండగా, మిగతా అవసరాల్ని దిగుమతులతో తీర్చుకోవాల్సి వస్తుంది.
* సౌర విద్యుత్ తయారీకి అవసరమైన సూర్యరశ్మి మన దేశంలో అపారం. ఉచితం. సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చేందుకు అవసరమైన సాంకేతికాల వినియోగానికి ప్రారంభంలోనే అధిక పెట్టుబడి కావాలి. కానీ, ప్రారంభమైన తర్వాత విద్యుదుత్పత్తి ఖర్చులు అతి స్వల్పం.
* థార్ ఎడారిలోని 35 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని సౌర విద్యుదుత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది.
* ఆహార ఉత్పత్తితో జీవ ఇంధన ఉత్పత్తి పోటీపడుతుంది. జీవ ఇంధన ఉత్పత్తివల్ల ఆహారధాన్యాల ధరలు 6-7% పెరుగుతాయని అంచనా.
* పెట్రోల్‌లో 20% మేర ఇథనాల్‌ను కలిపి, వచ్చిన మిశ్రమాన్ని ఇంజన్‌లో ఏమార్పు లేకుండా వాడవచ్చు. మనదేశంలో ఇలా 10 % కలిపి వాడుతున్నాం.
* 2011-12 లో మన పెట్రోల్ వాడకం 12.85 మి.టన్నులు. 2016-17కి ఇది 16.4 మి.టన్నులకు పెరుగుతుంది. దీనిలో జీవ ఇంధనాన్ని 10% కలపడానికి 2011-12లో 1.29 మి.టన్నులు, 2016-17లో 1.64 మి.టన్నుల అవసరం.
* డీజిల్ ఇంజన్‌లో ఏమార్పూ లేకుండా 20% వరకూ బయో డీజిల్‌ను కలిపిన మిశ్రమాన్ని వాడొచ్చు.
* 2010-11 నాటికి మన డీజిల్ వాడకం 66.91 మి.టన్నులు ఉంటుంది. 2016-17 నాటికి ఇది 83.58 మి.టన్నులకు పెరుగు తుంది. దీనిలో 10 % బయో డీజిల్ కలపడానికి 2011-12లో 6.69 మి.టన్నులు, 2016-17 నాటికి 8.36 మి.టన్నుల బయో డీజిల్ అవసరం.
*జట్రోపా, గానుగ నూనెలను నేరుగా డీజిల్ ఇంజన్లలో ఇంధనంగా వాడొచ్చు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
__________________________________________________________________________________________________________________________________

January 11th, 2012
మూత పెట్టకుండా ఉడికించే ఆహార పదార్థాల్లో ‘ఎ’ విటమిన్ లోపిస్తుంది. నీళ్లు ఎక్కువగా పోసి ఉడికిస్తే ’బి’ విటమిన్ తగ్గుతుంది. అదే పనిగా ఉడికిస్తే ‘సి’ విటమిన్ పోతుంది.
బియ్యం ఉడికే సమయంలో రెండు చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం తెల్లగా వస్తుంది. అన్నం ఉడికేటపుడు కాస్త నూనె వేస్తే అన్నం పొడిపొడిగా ఉంటుంది.
క్యాబేజీ కూరలో పచ్చివాసన పోవాలంటే అది ఉడుకుతుండగా ఒక బ్రెడ్ ముక్కను వేయాలి.
బెండకాయ ముక్కలను నూనెలో వేయించాక కొద్దిగా ఉడకబెడితే జిగురు ఉండదు.
బఠాణీలు ఉడికించేటపుడు కొంచెం పంచదార వేస్తే అవి రుచికరంగా ఉంటాయి.
ఎస్., January 3rd, 2012
చర్మం పగుళ్లు, చర్మంపై మంటలు, దురదలు లాంటి ఇబ్బందులు వున్నవారు గ్రీన్ ఆపిల్స్ జ్యూస్ రాస్తే సేద తీరుతారు. ముందు ముందు ఆ సమస్య దూరవౌతుంది.
పైనాపిల్ జ్యూస్ శరీరంపై, ముఖంపై ఏర్పడే చిన్న చిన్న సమస్యల బాధను తీరుస్తుంది. జ్యూస్‌ని రాసి బాగా ఆరాక మెత్తటి టవల్‌తో అద్దుతూ రాయండి.
మొటిమలున్నవారు, చర్మ సంబంధిత ఎలర్జీలున్న వారు పెరుగుతో శెనగపిండి కలిపి పేస్టులా చేసుకోండి. పేస్ట్ చేసిన దాన్ని సమస్య వున్న చోటరాయండి. మంచి ఛాయ ఉన్న వారు నీటితో లేదా గ్లిజరిన్‌తో కలిపి రాసుకోండి.
ముఖంపై బొబ్బలు, దద్దుర్లు, పొక్కులకు దోసకాయ జ్యూస్ చేసి రాసుకోండి. బెటర్‌మెంట్ కోసం క్యారెట్, లెటూస్, అల్ఫాజ్యూస్‌లతో కూడా కలిపి వాడుకోవచ్చు.
మునగకాయ గింజలతో, ఆకులతో నిమ్మరసం కలిపి పేస్టులా చేసి నల్లటి మచ్చలు, మొటిమలకు రాయడంవల్ల చక్కటి గుణం వుంటుంది.
మెంతి ఆకులను, నీటిని కలిపి పేస్ట్‌లాచేసి రాత్రిపూట రాసుకుని తిరిగి ఉదయం పూట వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ముఖంపై ముడతలు తగ్గుతాయి. పొడిచర్మం మృదువుగా తయారవుతుంది. మెంతి గింజలను నీటిలో బాగా ఉడకపెట్టి ఆపై పేస్టులా చేసి ముఖానికి పట్టించడంద్వారా చక్కటి ఫలితం కనిపిస్తుంది.
నిమ్మరసం చర్మం పగుళ్లను, మొటిమలు, మచ్చలను తరిమికొడుతుంది. గోరువెచ్చని వేడిపాలలో నిమ్మరసం కలిపి రాసుకుంటే ముఖానికి మంచి నిగారింపు వస్తుంది.
మొటిమల నివారణకు, కీటకాలు కుట్టినపుడు, దద్దుర్లు వచ్చినపుడు, చర్మ సంబంధమైన సమస్యలకు పుదీనా చాలా బాగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు పుదీనా రసం రాసుకుంటే ముఖం కళకళలాడుతుంది.